తరణ్ ఆదర్శ్ ‘సాహో’ రివ్యూపై భగ్గుమన్న ప్రభాస్ ఫ్యాన్స్
ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ 'సాహో' సినిమాకు 1½ రేటింగ్ ఇస్తూ ఇచ్చిన రివ్యూపై ప్రభాస్ అభిమానులు భగ్గున్నారు. ట్విట్టర్ పేజీలో అతడు ఇచ్చిన రివ్యూపై తమదైన కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
'సాహో' భరించలేని విధంగా ఉందని వ్యాఖ్యానించిన తరణ్ ఆదర్శ్.... టాలెంట్, డబ్బు, అవకాశం అన్నీ వ్యర్థం అయ్యాయి, బలహీనమైన కథ, గందరగోళంగా ఉన్న స్క్రీన్ ప్లే, మెచ్యూరిటీ లేని డైరెక్షన్ అంటూ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
నువ్వు ‘భారత్’ సినిమాకు 4 రేటింగ్ ఇచ్చావ్, కానీ ఆ సినిమా..
సల్మాన్ ఖాన్ నటించిన ‘భారత్' మూవీకి నువ్వు 4 స్టార్ రేటింగ్ ఇచ్చావు. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. దీనిపై నువ్వు ఎలాంటి వివరణ ఇస్తావు అంటూ.... ప్రభాస్ అభిమానులు తమదైన శైలిలో తరణ్ ఆదర్శ్ మీద విరుచుకుపడ్డారు.
ప్రేమ్ రతన్ ధన్ పాయో
సల్మాన్ ఖాన్ మూవీ ప్రేమ్ రతన్ ధన్ పాయో చిత్రానికి కూడా తరణ్ ఆదర్శ్ 4.5/5 రేటింగ్ ఇచ్చారు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం పాలైంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ప్రభాస్ అభిమానులు అతడికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశారు.
షారుక్ ఖాన్ ఫ్యాన్ మూవీ
షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన ఫ్యాన్ చిత్రానికి కూడా తరణ్ ఆదర్శ్ 3.5 రేటింగ్ ఇచ్చారు. ఈ మూవీ సైతం పరమ ప్లాప్ మూవీగా నిలిచింది. ఇవన్నీ గుర్తు చేయడం ద్వారా తరణ్ ఆదర్శ్ రివ్యూలను టార్గెట్ చేస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ తమ ప్రతాపం చూపుతున్నారు.

సాహో
ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ‘సాహో' మూవీని యూవీ క్రియేషన్స్ వారు రూ. 350 కోట్లతో నిర్మించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టెనర్ ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైందనే వాదన అయితే ఉంది. సినిమా ఫైనల్ రిజల్ట్ ఏమిటి... ఫస్ట్ వీకెండ్ వసూళ్లను బట్టి ఓ అంచనాకు రావొచ్చు.


Click it and Unblock the Notifications











