బ్యాడ్ రివ్యూలు ‘సాహో’ జోరు ఆపలేక పోయాయి... బాలీవుడ్‌కి మరో సల్మాన్ దొరికాడా?
ఓ వైపు ప్రముఖ సినీ విమర్శకుల నుంచి నెగెటివ్ రివ్యూలు, సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ ... అయితే ఇవేవీ ప్రభాస్ 'సాహో' ప్రభంజనాన్ని ఆపలేకపోతున్నాయి. వసూళ్ల వర్షం కొనసాగుతూనే ఉంది. దీంతో అభిమానులు బాలీవుడ్ బాక్సాఫీసుకు మరో సల్మాన్ దొరికాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా కొందరు సల్మాన్ ఖాన్, ప్రభాస్ సినిమాలను కంపేర్ చేస్తూ... నెగెటివ్ టాక్‌లోనూ ఇద్దరి సినిమాలు ఎలా వసూళ్ల ప్రభంజనం క్రియేట్ చేస్తున్నాయి? వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో వెల్లడిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.

@AmitLalwani
"సాహో చిత్రం అన్ని బ్యాడ్ రివ్యూలను అధిగమించింది. సల్మాన్ ఖాన్ చిత్రం లాగా వసూళ్లు కురిపిస్తూ దూసుకెళుతోంది.''

@jaihosalman11
బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ క్రిటిక్ ప్రూఫ్ స్టార్. ఆయన ప్రతి సినిమాపై కొందరు క్రిటిక్స్ నెగెటివ్ రివ్యూలు రాస్తూనే ఉంటారు. కానీ వారి రివ్యూలు సల్మాన్ చిత్రాన్ని ఏమీ చేయలేవు. అందుకే ఆయన ఇండస్ట్రీని రూల్ చేస్తున్నారు. ఇపుడు సాహో కూడా అదే విధంగా దూసుకెళుతోంది.

@SurrealZak
"ఇప్పుడు నార్త్ ఇండియాలో సల్మాన్ ఖాన్‌కు ప్రభాస్ ప్రత్యామ్నాయమని భావిస్తున్నాను. సింగిల్ స్క్రీన్ ప్రేక్షకులు అతని సినిమాలను బాగా ఆదరిస్తున్నారు."

@Hamzah_Bhuta
సాహో చిత్రాన్ని ఆపడం ఎవరి వల్లా కాదు. సల్మాన్ ఖాన్ & రజనీ కలిసి వచ్చినా ప్రభాస్ వారికంటే బిగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. ఈ మాటతో ఎంత మంది ఏకీభవిస్తారు?

@patnaik_harshit
"లైఫ్ టైమ్ అనేది సినిమాపై ఆధారపడి ఉంటుంది, అయితే ఓపెనింగ్స్ స్టార్‌డమ్ మీద ఆధారపడి ఉంటాయి. ప్రభాస్ ఒక స్టార్... అందుకే నాన్హాలిడే సీజన్లో కూడా దుమ్ము రేపుతోంది. సల్మాన్ ఖాన్ సినిమాలా ‘సాహో' దూసుకెళుతోంది.

నెటిజన్ల వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా?
హిందీ వెర్షన్ సాహో బాక్సాఫీస్ కలెక్షన్ వివరాల్లోకి వెళితే... ఆరు రోజుల్లో రూ 109.28 కోట్లు వసూలు చేసింది. ప్రభాస్‌ను సల్మాన్ ఖాన్‌తో కొందరు పోల్చడాన్ని మీరు అంగీకరిస్తారా? మీ అభిప్రాయాలు కామెంట్ బాక్సులో వెల్లడించండి.


Click it and Unblock the Notifications











