Prabhas Vs Akshay Kumar.. బాక్సాఫీస్ వద్ద ఆదిపురుష్ ఫైట్

బాలీవుడ్‌లో అగ్ర హీరోల మధ్య భారీ పోటీకి తెరలేచింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్, అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్న రక్షాబంధన్ చిత్రాలు ఒకే రోజు రిలీజ్‌కు సిద్దమయ్యాయి. దాంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోరుకు తెరలేచింది. బాహుబలితో ప్యాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్‌తో బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ దర్శకత్వంలో ఆదిపురుష్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. కరోనావైరస్ లాక్‌డౌన్ తర్వాత ఆదిపురుష్ చిత్రం ఇటీవల ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తోపాటు సైఫ్ ఆలీ ఖాన్, కృతి సనన్, సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను 2022 ఆగస్టు 11వ తేదీన రిలీజ్ చేయాలని విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.

అయితే ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన విషయాలు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతున్నాయి. ఆదిపురుష్ సినిమా క్లైమాక్స్ కొత్త అనుభూతిని కలించేలా ప్రయత్నిస్తున్నారనే తాజా సమాచారం. అయితే ఈ చిత్రంలో డచ్, సెర్బియా, జర్మన్, ఉక్రేయిన్ దేశాలకు చెందిన నటీనటులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా కోసం ఓ స్టూడియోలో పలువురు సంగీత కారులతో నభూతో నభవిష్యత్ అనే విధంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను సిద్దం చేస్తున్నట్టు సమాచారం.

 Prabhass Adipurush clash with Akshay Kumars Raksha Bandhan at box office

ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలను సొంతం చేసుకొన్న ఆదిపురుష్ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం రోజును పురస్కరించుకొని రిలీజ్ అవుతుండగా.. అదే సమయంలో అక్షయ్ కుమార్ తన చిత్రం కూడా ఆగస్టు 11వ తేదీ 2022 రక్షా బంధన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యారు. దాంతో ఇద్దరు అగ్రహీరోల చిత్రాలు బాక్సాఫీస్ టఫ్ ఫైట్‌కు సిద్ధమయ్యాయి.

ప్రభాస్, అక్షయ్ కుమార్ సినిమాలు ఒకే రోజున రిలీజ్ కానుండటంతో బాలీవుడ్‌ మీడియా, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలు ఇస్తాయనే విషయంపై చర్చ జరుగుతున్నది.

రక్షాబంధన్ చిత్రంలో అక్షయ్ కుమార్‌తోపాటు భూమి పడ్నేకర్, సాహెజ్‌మీన్, దీపికా ఖన్నా, సాడియా ఖతీబ్, సృతి శ్రీకాంత్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్వకత్వం వహిస్తున్నారు. జీస్టూడియోస్, ఆనంద్ ఎల్ రాయ్, అక్కా హిరనందాని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X