‘ఆదిపురుష్’పై డైరెక్టర్ కీలక ప్రకటన: ప్రభాస్ లేకుండానే జరుగుతుంటూ వివరణ
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఏక కాలంలోనే పలు సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం అతడు నటిస్తోన్న చిత్రాల్లో 'ఆదిపురుష్' ఒకటి. రామాయణం నాటి కథతో చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్టుతో ఈ సినిమా రూపొందుతోంది. చారిత్రక చిత్రాల దర్శకుడిగా పేరొందిన ఓం రౌత్ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఎప్పుడో షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా.. చాలా వరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వల్ల షూట్ వాయిదా పడిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి డైరెక్టర్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు.
డివోషనల్ జోనర్‌లో రాబోతున్న 'ఆదిపురుష్' షూటింగ్ ముంబైలో జరిగింది. ఆ తర్వాత అక్కడ కరోనా విజృంభించడంతో హైదారాబాద్‌కు షిప్ట్ చేశారు. ఇక్కడ కూడా లాక్‌డౌన్ పెట్టడంతో షూటింగ్ అస్సలు ప్రారంభమే కాలేదు. ఇక, ఇప్పుడు మహారాష్ట్రలో పరిస్థితులు చక్కబడడంతో తాజాగా ఈ మూవీ చిత్రీకరణను పున: ప్రారంభించారు. ఈ విషయాన్ని దర్శకుడు ఓం రౌత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో సెల్ఫీ వీడియోను స్టోరీగా పెట్టాడు. ఇక, ఇందులో ప్రభాస్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు వివరించాడు. అలాగే, త్వరలోనే అతడు షూట్‌లో చేరుతాడని చెప్పుకొచ్చాడు.

భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'ఆదిపురుష్'లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రభాస్ శ్రీరాముడిగానూ.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. అలాగే, టాల్ బ్యూటీ కృతి సనన్ సీతగా చేస్తోంది. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను పోషిస్తున్నాడు. ఇది తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











