ప్రభాస్ హీరోయిన్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్.. అది నా డిక్షనరీలో లేదంటూ తండ్రి కామెంట్
బాలీవుడ్ నటి శ్రద్దాకపూర్, తన చిన్ననాటి స్నేహితుడు రోహన్ శ్రేష్ఠ అఫైర్, డేటింగ్ వ్యవహారం ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త మీడియాలో తరచుగా వినిపిసున్నప్పటికీ పెదవి విప్పడం లేదు. అయితే శ్రద్దా పెళ్లి వార్తలపై ఆమె తండ్రి ఇటీవల స్పందిస్తూ.. అలాంటి విషయంపై నా వద్ద సమాచారం లేదు. కానీ ఆమె ఎవరిని పెళ్లి చేసుకొంటానని చెప్పిన అభ్యంతరం లేదు అంటూ స్పష్టత ఇచ్చారు.
తాజాగా మాల్దీవులలో శ్రద్దా బర్త్ డే వేడుకలను రోహన్ క్రేజీగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వారిద్దరూ అతి సన్నిహితంగా కౌగిలించుకొన్న ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో రోహన్ తండ్రిని మీడియా అడిగిన పలు ప్రశ్నలకు కూల్‌గా సమాధానం ఇచ్చారు.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రోహన్ తండ్రి రాకేష్ శ్రేష్ట మాట్లాడుతూ.. శ్రద్దా కపూర్‌తో నడుస్తున్న అఫైర్ విషయంపై క్లారిటీ ఇచ్చారు. శ్రద్దా, రోహన్ ఇద్దరూ ప్రొఫెషనల్‌గా మంచిగా ఉన్నారు. తమ వ్యక్తిగత జీవితాలు, పెళ్లికి సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకొన్నప్పటికీ.. అది పరిణతితో కూడినదని భావిస్తాను అని అన్నారు
శ్రద్దా, రోహన్ పెళ్లి చేసుకోవాలనుకొంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వారి పెళ్లికి కావాల్సిన విషయాలను నేను స్వయంగా చూసుకొంటాను. వారి పెళ్లి విషయంలో అభ్యంతరం అనేది నా డిక్షనరీలోనే లేదు అంటూ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, ప్రభాస్ నటించిన సాహో చిత్రంలో శ్రద్దా కపూర్ నటించిన సంగతి తెలిసిందే. తన గ్లామర్‌తో ఆమె తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











