Adipurush నుంచి బిగ్ సర్‌ప్రైజ్: ప్రభాస్ అభిమానులకు డబుల్ ట్రీట్
తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోనే అయినా దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుని పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ క్రమంలోనే వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏకకాలంలోనే వరుసగా నాలుగైదు ప్రాజెక్టులను చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. ఇందులో అతడు 'ఆదిపురుష్' అనే స్ట్రయిట్ బాలీవుడ్ మూవీని కూడా చేస్తున్నాడు. డివోషనల్ కాన్సెప్టుతో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలోనే ఏర్పడ్డాయని చెప్పొచ్చు.
ఇండియాలోనే చారిత్రక సినిమాల దర్శకుల్లో ఒకడిగా పేరొందిన ఓం రౌత్ రూపకల్పనలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సినిమానే 'ఆదిపురుష్'. దీని ద్వారా మన స్టార్ హీరో బాలీవుడ్‌లోకి నేరుగా అడుగు పెడుతున్నాడు. రామాయణంలో ఇప్పటి వరకూ ఎవరూ చూపించని పాయింట్‌తో.. చెడు మీద మంచి ఎలా గెలిచింది అన్న కాన్సెప్టుతో ఈ సినిమా రూపొందుతోన్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. విజువల్ వండర్‌గా వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ చాలా రోజుల క్రితమే ముగిసింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఆదిపురుష్' మూవీ నుంచి ఇప్పటి వరకూ కొన్ని అప్‌డేట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రం నుంచి మొదటి సాంగ్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలోని మొదటి పాటను మార్చి నెలలోనే విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించిన ప్రకటన కూడా కొద్ది రోజుల్లోనే రానుందని సమాచారం. అలాగే, శ్రీరామనవమికి కూడా ఊహించని ట్రీట్ ఇవ్వబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

విజువల్ వండర్‌గా రాబోతున్న 'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తోన్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











