Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్.. భారీగా తగ్గిపోయిన ఆదిపురుష్ టికెట్ రేట్
'ఆదిపురుష్.. ఆదిపురుష్.. ఆదిపురుష్..' దాదాపు రెండు నెలలుగా ఇండియా వ్యాప్తంగా మారుమ్రోగిపోతోన్న సినిమా పేర్లలో ఇది ఒకటి. అంతలా మన ప్రభాస్ నటించిన ఈ చిత్రం రిలీజ్‌కు ముందే భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసుకుంది. దీంతో ఎవరూ ఊహించని రీతిలో బిజినెస్‌ను జరుపుకుని ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కానీ, ఈ సినిమాకు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ రావడంతో కలెక్షన్లు పెద్దగా రావడం లేదు. అయినప్పటికీ ఇది పది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 450 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసినట్లు నిర్మాతలు వెల్లడించారు.
ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' మూవీకి హిందీలో ఆశించిన రీతిలో స్పందన రావడం లేదు. దీంతో అక్కడ అనుకున్న దానికంటే చాలా తక్కువగా కలెక్షన్లు వస్తున్నాయి. దీంతో ఆడియెన్స్ నుంచి మరింత ఎక్కువ రెస్పాన్స్ వస్తుందని చిత్ర యూనిట్ 3D వెర్షన్‌కు సంబంధించిన టికెట్ రేట్లను రూ. 150కి తగ్గించింది. అయినప్పటికీ పెద్దగా ఫలితం లేకుండా పోయింది. ఇక, ఈ వీకెండ్‌లో తెలుగులో వసూళ్లు డబుల్ అయినా.. హిందీలో మాత్రం కొంచెమే పెరిగాయి. దీంతో చిత్ర యూనిట్ టికెట్ రేట్లను మరింతగా తగ్గించేసింది.

నార్త్ ఆడియెన్స్‌కు తక్కువ ధరకే 'ఆదిపురుష్' 3D వెర్షన్ ఎక్స్‌ప్రీరియన్స్‌ను అందించాలన్న ఉద్దేశంతో చిత్ర యూనిట్ ఈ మూవీ టికెట్ రేట్లను రూ. 150 నుంచి రూ. 112కు తగ్గించింది. ఈ కొత్త ధరలు సోమవారం ఉదయం ఆటల నుంచే అందుబాటులోకి వచ్చేశాయి. ఇవి ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల్లో ఉన్న పీవీఆర్, ఐనాక్స్, సినీపోల్స్ సహా ఎన్నో మల్టీఫ్లెక్స్‌ల్లోనూ తగ్గించారు. అంతేకాదు, ఈ చిత్రంలోని అభ్యంతరకంగా ఉన్న కొన్ని డైలాగులను కూడా మార్చేసి ఈరోజు నుంచి ప్రదర్శించబోతున్నట్లు ఇదే ప్రకటనలో తెలిపింది. తెలుగులో మాత్రం రేట్లు యథాతదంగా ఉండబోతున్నట్లు తెలిసింది.

ఇక, ప్రభాస్ హీరోగా నటించిన 'ఆదిపురుష్' మూవీని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు. ఇందులో ప్రభాస్ రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా చేశారు. అజయ్, అతుల్ మ్యూజిక్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











