భాగస్వామిని పరిచయం చేసిన ప్రభాస్: ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తూ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన రెబెల్ స్టార్

టాలీవుడ్‌ నుంచి హీరోగా పరిచయమై.. దేశ వ్యాప్తంగా ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న వారిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. పేరుకు తెలుగు హీరోనే అయినా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపిస్తున్నాడతను. అందుకే వరుసగా పాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నేరుగా ఓ హిందీ చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఇలాంటి సమయంలో తన భాగస్వామిని పరిచయం చేశాడు ప్రభాస్. అంతేకాదు, తన కుటుంబంలోకి స్వాగతం చెబుతూ ఓ పోస్టు కూడా పెట్టాడు. ఆ వివరాలు మీకోసం!

‘ఆదిపురుష్’గా ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభాస్

‘ఆదిపురుష్’గా ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభాస్


యంగ్ రెబెల్ స్టార్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న చిత్రమే 'ఆదిపురుష్'. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వీఎఫ్ఎక్స్ వండర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్న విషయం తెలిసిందే.

ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని కథతో

ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని కథతో

చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్ట్‌తో.. రామయాణంలో ఎవరూ టచ్ చేయని ఓ పాయింట్‌తో 'ఆదిపురుష్' రూపొందుతోంది. ఈ చిత్రంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగానూ.. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. అలాగే ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ప్రభాస్ లుక్ అదిరిపోయేలా ఉంటుందని తెలుస్తోంది.

హిస్టరీలోనే భారీగా.. తొలిసారి అలా చేస్తూ

హిస్టరీలోనే భారీగా.. తొలిసారి అలా చేస్తూ

దేశ వ్యాప్తంగా 'ఆదిపురుష్' సినిమాపై అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్‌ పార్ట్ ఎక్కువగా ఉండబోతుందని ఇప్పటికే యూనిట్ నుంచి ఓ క్లారిటీ వచ్చింది. దీని కోసం ఇండియాలోనే ఫస్ట్ టైమ్ ఏకంగా రూ. 100 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది.

మొదటి రోజే అశుభం... ఫ్యాన్స్‌లో భయం

మొదటి రోజే అశుభం... ఫ్యాన్స్‌లో భయం

ఫిబ్రవరి 2వ తేదీన 'ఆదిపురుష్' మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అయింది. ముంబైలో వేసిన భారీ సెట్‌లో పూజా కార్యక్రమాలు సైతం జరిగాయి. సరిగ్గా అప్పుడే అక్కడ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ప్రాణనష్టం అయితే లేదు కానీ.. ఆస్తి నష్టం మాత్రం బాగా జరిగింది. ఈ ఘటనతో బాలీవుడ్‌, టాలీవుడ్‌లో ప్రకంపనలు రేగాయి. ఫ్యాన్స్ భయపడిపోయారు.

భాగస్వామిని పరిచయం చేసిన రెబెల్ స్టార్

భాగస్వామిని పరిచయం చేసిన రెబెల్ స్టార్

'ఆదిపురుష్' నటించే హీరోయిన్ విషయంలో చాలా రోజులుగా ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఇందులో సీతగా నటించే హీరోయిన్ వివరాలు వెల్లడించారు. అనుకున్నట్లే కృతి సనన్‌ను ఈ పాత్రకు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా వెల్లడిస్తూ ఆమెకు వెల్‌కం చెప్పాడు.

తమ్ముడికి కూడా స్వాగతం చెప్పిన ప్రభాస్

తమ్ముడికి కూడా స్వాగతం చెప్పిన ప్రభాస్


ఇక, 'ఆదిపురుష్' ఎంతో ముఖ్యమైన లక్ష్మణుడి పాత్రను పోషించే హీరో పేరునూ తాజాగా వెల్లడించారు. ముందు నుంచీ ప్రచారం జరుగుతున్నట్లుగానే ఈ రోల్ కోసం బాలీవుడ్ హీరో సన్నీ సింగ్‌ను తీసుకున్నారు. అతడికి కూడా యంగ్ రెబెల్ స్టార్ స్వాగతం పలికాడు. కృతి సనన్, సన్నీ సింగ్‌తో పాటు దర్శకుడు ఓం రౌత్‌తో దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు ప్రభాస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X