Prashant Kishor Biopic: షారుక్ ఖాన్‌‌తో ప్రశాంత్ కిషోర్ భేటి.. బాలీవుడ్‌లో అసలు విషయం బట్టబయలు!

బాలీవుడ్‌లో కొద్ది రోజులుగా అనేక పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. హిందీ చిత్ర సీమలో సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్, పొలిటికల్ కన్సల్టెంట్ ప్రశాంత్ కిషోర్ కలుసుకోవడం అనేక ఊహగానాలకు తెర లేచాయి. అయితే త్వరలో రూపొందే తన బయోపిక్ విషయంలో షారుక్‌ను ప్రశాంత్ కిషోర్ కలిసినట్టు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ వ్యక్తిగత జీవితం, వారిద్దరి భేటీ వివరాల్లోకి వెళితే..

పలు రాజకీయ పార్టీలకు క్యాంపెయినర్‌గా

పలు రాజకీయ పార్టీలకు క్యాంపెయినర్‌గా

రాజకీయ రంగంలో ప్రశాంత్ కిషోర్ గురించి తెలియని వారుండరంటే అనుమానం అక్కర్లేదు. పొలిటికల్ కన్సల్టెంట్, పొలిటీషియన్‌, స్ట్రాటెజిస్ట్‌గా సుపరితులు. ఇటీవల కాలంలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్, వైఎస్ఆర్సీపీ, డీఎంకే, టీఎంసీ పార్టీలకు పొలిటికల్ క్యాంపెయిన్ నిర్వహించారు.

నరేంద్ర మోదీకి వెన్నుదన్నుగా

నరేంద్ర మోదీకి వెన్నుదన్నుగా

గుజరాత్ సీఎంగా నరేంద్రమోదీ ప్రధాని పదవి రేసులోకి వచ్చిన తర్వాత 2011 నుంచి ఆయనకు పొలిటికల్ క్యాంపెయిన్ నిర్వహించడం ద్వారా అత్యంత పాపులారిటీ సంపాదించారు. కానీ అంతకుముందే మూడోసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ పోటీ చేసిన సమయంలో ఆయన విజయానికి కూడా కృషి చేశారు. తద్వారా మోదీ మూడోసారి సీఎంగా విజయం సాధించడం తెలిసిందే.

ఏపీలో వైఎస్ జగన్‌కు అండగా

ఏపీలో వైఎస్ జగన్‌కు అండగా

2015లో బీహార్‌లో నితీష్‌కు, 2019లో ఏపీలో వైఎస్ జగన్‌కు ప్రచార బాధ్యతలను భుజానికి ఎత్తుకొన్నారు. తాజాగా పోటాపోటీగా జరిగిన బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ, మమతా బెనర్జీని విజయబాటలో నడిపించడం ద్వారా మరింత పాపులారిటీని సాధించారు. మోడీతో జరిగిన అధిపత్య పోరులో మమతకు మళ్లీ రాజ్యాధికారాన్నికట్టబెట్టడంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు.

బాలీవుడ్‌లో ప్రశాంత్ కిషోర్ బయోపిక్

బాలీవుడ్‌లో ప్రశాంత్ కిషోర్ బయోపిక్

అత్యంత చిన్న వయసులో ఎదురులేని రాజకీయ విశ్లేషకుడిగా, వ్యూహకర్తగా పేరు సంపాదించుకొన్న ప్రశాంత్ కిషోర్ జీవితం ఆధారంగా బయోపిక్ నిర్మాణానికి బాలీవుడ్‌లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం బయటకు రాలేదు. కాకపోతే ఇటీవల ముంబైలో షారుక్ ఖాన్ అధికార నివాసం మన్నత్‌లో షారుక్, ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం అత్యంత చర్చనీయాంశమైంది.

Recommended Video

Most Awaited Movies Love Story , Kgf chapter 2 Updates || Filmibeat Telugu
సొంత బ్యానర్‌లో షారుక్ ఖాన్

సొంత బ్యానర్‌లో షారుక్ ఖాన్

అయితే ప్రశాంత్ కిషోర్ బయోపిక్‌లో షారుక్ ఖాన్ నటిస్తున్నారనే వార్తలు బాలీవుడ్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ నిర్మించే బయోపిక్‌లో ప్రశాంత్ కిషోర్‌గా షారుక్ కనిపించబోతున్నారనే వార్త ప్రధానంగా వినిపిస్తున్నది. అయితే త్వరలో రాజకీయాల్లో క్రీయాశీలక పాత్రను పోషించనున్న ప్రశాంత్ కిషోర్ బయోపిక్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందనే మాట బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X