twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సక్సెస్ పొగరు తలకెక్కింది.. అందుకే దారుణంగా దెబ్బ తిన్నా.. యువ హీరో రియలైజేషన్

    |

    స్వర్గీయ స్మితాపాటిల్, హీరో రాజ్ బబ్బర్ దంపతుల వారసుడిగా బాలీవుడ్‌లోకి ప్రవేశించిన ప్రతీక్ బబ్బర్ కెరీర్ రేసులో వెనకపడి పోయాడు. జానే తూ.. యా జానే నా చిత్రంతో ఆకట్టుకొన్న ఈ యువ హీరో వెండి తెరకు దూరమయ్యాడు. అయితే తన తప్పు తెలుసుకొన్న ప్రతీక్ ఇప్పుడు కెరీర్‌ను గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సక్సెస్‌తో తలకు పొగరు ఎక్కడంతో కెరీర్ ప్రమాదంలో పడిందని అన్నారు.

    ఇటీవల మీడియాతో ప్రతీక్ బబ్బర్ మాట్లాడుతూ.. నా తొలి సినిమా విడుదలైనప్పుడు నా వయసు కేవలం 19 సంవత్సరాలే. ఆ సమయంలో నాకు యాక్టింగ్ చేయాలని, లేదా నటుడు కావాలనే ఆసక్తి కూడా లేదు. సినిమాలో నటించడమంటే డబ్బులు ఇచ్చి వినోదాన్ని పొందడం అనే భావనతో ఉండే వాడిని అని ప్రతీక్ అన్నారు.

    Prateik Babbar realisation: success went to my head

    నా తొలి సినిమాతోనే సక్సెస్ రావడంతో నాకు అర్ధం కాలేదు. విజయాన్ని తలకు ఎక్కించుకొన్నాను. దాంతో అవకాశాలు దూరమయ్యాయి. అదంతా నా అవివేకంతోనే జరిగాయని తెలుసుకొన్నాను అని అన్నారు.

    2008లో సినిమా పరిశ్రమలోకి వచ్చిన ప్రతీక్ ధోబీ ఘాట్, దమ్ మారో దమ్, ఉమ్రికా, భాగీ 2, ముల్క్ అనే చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం రజనీకాంత్‌తో దర్బార్ చిత్రంలో ఓ విలన్ పాత్రను పోషిస్తున్నాడు.

    English summary
    Actor Prateik Babbar says there is a big shift in his approach towards his work, and so, he does not take any opportunities for granted. He said, Initially, the success went to my head so much that I lost it... I was young and to an extent immature as well
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X