బాలీవుడ్ హీరో పబ్లిసిటీ పిచ్చి.. భార్యతో కలిసి అర్దనగ్నంగా, నెటిజన్ల చివాట్లు!
బాలీవుడ్ హీరో ప్రతీక్ బబ్బర్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వివాదాస్పదంగా మారింది. ఈ ఫోటోలో ప్రతీక్ తన భార్య సాన్యా సాగర్‌తో కలిసి టాప్ లెస్‌గా దర్శనమివ్వడమే ఇందుకు కారణం. , స్మితాపాటిల్-రాజ్ బబ్బర్ దంపతులు కుమారుడైన ప్రతీక్ తన గర్ల్ ఫ్రెండ్ సాన్యాను ఇటీవలే పెళ్లాడారు.
వాలంటైన్స్ డే సందర్భంగా ఏదైనా స్పెషల్‌గా చేయాలనే ఉద్దేశ్యంతో ప్రీతీక్-సాన్య ఈ అర్ధనగ్న చర్యకు పాల్పడ్డారు. వీరిపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది.

తన చేతులతో భార్య ప్రైవేట్ పార్ట్స్ కవర్ చేస్తూ
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలో ప్రీతీక్, సాన్య ఇద్దరూ టాప్ లెస్‌గా దర్శనమిచ్చారు. ప్రతీక్ తన భార్య ప్రైవేట్ పార్ట్స్ చేతులతో కవర్ చేస్తుండగా... సాన్య తన సెల్ ఫోన్లో తమ సెమీ న్యూడ్ మూమెంట్ చిత్రీకరించింది.

నెటిజన్ల చివాట్లు
తమ ప్రేమబంధం గురించి అందరికీ తెలిసేలా ఈ జంట వాలంటైన్స్ డే సందర్బంగా చేసిన ఈ ప్రయత్నం నెటిజన్ల చివాట్లకు కారణమైంది. ఇదేం పైత్యం అంటూ కొందరు మండి పడుతున్నారు. ప్రైవేట్ ఫోటోలు పబ్లిక్‌లో పెట్టడానికి సిగ్గులేదా? ఇద్దరూ పోర్న్ స్టార్ల మాదిరిగా ఉన్నారంటూ విమర్శిస్తున్నారు.

వీరికి పబ్లిసిటీ పిచ్చి పట్టుకుంది
కొత్తగా పెళ్లైన వీరికి పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందని మరికొందరు విమర్శిస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల పబ్లిసిటీ పెరగడం కాదుకదా.. ఉన్న పరువుపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రతీక్ బబ్బర్
ప్రతీక్ బబ్బర్ హీరోగా సినిమాల విషయానికొస్తే...గతేడాది ‘భాగి 2', ‘ముల్క్', ‘మిత్రోన్' చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ‘చిచ్చోరే', ‘బ్రహ్మాస్త్ర', ‘యారామ్' చిత్రాలు చేస్తున్నాడు. హీరోగా ప్రతీక్ చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాక పోవడంతో సైడ్ క్యారెక్టర్లతో సంతృప్తి పడక తప్పడం లేదు.


Click it and Unblock the Notifications











