‘ కొత్త హీరోయిన్లు అతని బెడ్ ఎక్కాల్సిందే.. ఆ వీడియోలతో ’
సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపుల గురించి రోజుకొకరు బాంబు పేలుస్తూ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నారు. ఇప్పటికే మలయాళ నటుడు షైన్ టామ్ చాకో , హీరోయిన్ విన్సీల వ్యవహారం భారతీయ సినీ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి తోడు డ్రగ్స్ వ్యవహారంలోనూ హీరో ఇరుక్కోవడంతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న ఆసక్తి నెలకొంది. తాజాగా ఓ నెటిజన్‌కు వార్నింగ్ ఇచ్చే క్రమంలో సినీ రంగంలో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు ఓ బాలీవుడ్ నటి. ఈ వివరాల్లోకి వెళితే..
చిత్ర పరిశ్రమలో నటీనటుల ఎఫైర్స్, చీకటి వ్యవహారాలు ఇప్పటివి కావు. నటీనటుల మధ్య బంధాలపై బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. మీ టూ ఉద్యమంతో పాటు గతేడాది జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ చిత్ర పరిశ్రమలో మహిళా నటులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వేధింపుల గురించి వివరించాయి. పని ప్రదేశాల్లో మహిళా నటులకు రక్షణ లేకుండా పోయిందని పలువురు వాపోతున్నారు. హీరోలు, దర్శక నిర్మాతలు, చివరికి సాధారణ లైట్‌మెన్‌ల నుంచి కూడా హీరోయిన్స్‌కు రక్షణ లేదని చాలామంది బయటపెట్టారు.

అంతా ఏదో ఒక రకంగా హీరోయిన్‌లని పొందాలని చూసేవారని బాలీవుడ్ నటి, గాయనీ కునిక సదానంద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. షూటింగ్‌కి పేకప్ చెప్పిన తర్వాత ఆకలిగా ఉన్న సింహాలు వేటకు సిద్ధంగా ఉన్నట్లుగా సెట్‌లో మగాళ్లు ప్రవర్తించేవారని ఆమె బయటపెట్టారు. తాజాగా బాలీవుడ్ నటి అమృత అరోరా సోదరి, మరో నటి ప్రీతిక రావు ఓ హీరో నిజస్వరూపం గురించి బయటపెట్టారు. దీనికి ఓ సోషల్ మీడియా యూజర్ పరోక్షంగా కారణమయ్యాడు.
బాలీవుడ్ నటుడు హర్షద్ అరోరా - ప్రతీక రావులు బెయింటెహా అనే సీరియల్‌లో జంటగా నటించారు. అయితే అందులోని సీన్లను ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రతీక కంట్లో ఆ వీడియోలు పడటంతో ఆమె అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. వాటిని తీసేయమని ప్రతీక అభ్యర్ధించారు.. కానీ అతను వినకపోగా.. మరు అతనితో కలిసి నటించినప్పుడు లేని బాధ ఇప్పుడెందుకు అని డొంక తిరుగుడు సమాధానం చెప్పాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన ప్రతీక తనదైన శైలిలో చెడుగుడు ఆడుకుంది.
కొన్ని సీన్లు ముందుగా అనుకున్న ప్రకారం కాకుండా అప్పటికప్పుడు చిత్రీకరిస్తారని , వీటిపై ముందస్తు సమాచారం కూడా ఉందడని నీకు ఆ విషయాలు తెలియవని ప్రతీక చురకలంటించింది. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన వారిని బెడ్ మీదకు లాగే వరకు వదలని మనస్తత్వం అతనిదంటూ హర్షద్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి వాడితో కలిసున్న వీడియోలు పోస్ట్ చేయొద్దని చెబుతుంటే వినిపించుకోవ? అని ప్రతీక మండిపడింది.
నువ్వు చేసిన పనికి కర్మ అనుభవిస్తావని శాపనార్ధాలు పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ప్రతీక రావు తెలుగులో వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన లవర్ బాయ్ సినిమాలో నటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడలోనూ పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం పాడ్‌కాస్ట్‌లు నిర్వహింస్తూ జోరుగా ఉంది ప్రతీక రావు.


Click it and Unblock the Notifications











