twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిండు గర్భంతో హీరోయిన్.. అయినా ఎలాంటి పని చేస్తుందంటే, బికినీ ఫోటోలు వైరల్!

    |

    హీరోయిన్ సమీరా రెడ్డి అందరికి గుర్తుండే ఉంటుంది. అందం, అభినయం అన్ని కలబోసిన నటి సమీరా రెడ్డి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించి అలరించింది. కుర్రకారు సమీరారెడ్డి అందాలకు ఫిదా అయ్యేవారు. ఆమె తెలుగులో నటించిన చిత్రాలు విజయం సాధించలేదు. కానీ సమీరా రెడ్డికి మాత్రం మంచి క్రేజ్ ఉంది. సమీరా రెడ్డి అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. ఇటీవల సమీరా రెడ్డి రెండవసారి గర్భవతి అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సమీరా రెడ్డి నిండు గర్భంతో ఉంది. తాజాగా సమీరా రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

     లక్మే ఫ్యాషన్ వీక్‌లో

    లక్మే ఫ్యాషన్ వీక్‌లో

    కొన్ని రోజుల క్రితమే సమీరారెడ్డి లక్మే ఫ్యాషన్ వీక్ లో పాల్గొని అలరించింది. ఆ సమయంలో సమీరా గర్భవతిగా ఉంది. ప్రస్తుతం సమీరా రెడ్డి గర్భం 5 నెలలు దాటినట్లు తెలుస్తోంది. సమీరా రెడ్డి సినిమాలకు గుడ్ బై చెప్పాక వ్యాపారవేత్త అక్షయ్ వర్ధేని వివాహం చేసుకుంది. 2014లో వీరిద్దరికి వివాహం జరిగింది. ఈ జంటకు ఇప్పటికే ఓ కొడుకు కూడా ఉన్నాడు.

     రెండవసారి తల్లి కాబోతూ

    రెండవసారి తల్లి కాబోతూ

    తాను, తన భర్త రెండవ సంతానం కోరుకుంటున్నట్లు సమీరా రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో ప్రకటించింది. తాను రెండవసారి గర్భవతి అయిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఆ సమయంలో సమీరారెడ్డికి అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా సమీరా రెడ్డి నిండు గర్భంతో ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

     గర్భంతో స్విమ్మింగ్

    గర్భంతో స్విమ్మింగ్

    సమీరా రెడ్డి గర్భవతిగా ఉంది కూడా బికినిలో ఉన్న తన ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలని అభిమానులతో పంచుకుంది. సమీరా రెడ్డికి ఇటీవల సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలు వచ్చాయి. కానీ రెండో సంతానం కోరుకుంటుండడంతో ఇప్పట్లో చేయలేనని తేల్చేసింది.

    విమర్శలకు ఘాటుగా

    విమర్శలకు ఘాటుగా

    సమీరా రెడ్డి గర్భవతి అయ్యాక అందవిహీనంగా తయారైందని సోషల్ మీడియాలో కామెంట్స్ ఎదురయ్యాయి. ఆ కామెంట్స్ కు సమీరా రెడ్డి అంతే ఘాటుగా బదులిచ్చింది. మీ తల్లి కూడా గర్భంతో ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది. కావాలంటే ఓ సారి అడిగి చూడు. మహిళలు గర్భంతో ఉన్నప్పుడు కాస్త బరువెక్కుతారు. అదేం పెద్ద సమస్య కాదు. తల్లిగా నేను చాలా సంతోషిస్తున్నా. అందం అనేది మనసుకు సంబంధించినది అంటూ సమీరా రెడ్డి వ్యాఖ్యానించింది.

    English summary
    Pregnant Sameera Reddy flaunts her baby bump in monokini in the pool. Sameera Reddy, who is pregnant with her second baby, took to Instagram to share a few pictures in monokini. The actress is expecting the child in July.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X