భయంగా ఉంది... క్వారంటైన్‌‌లో సీనియర్ హీరోయిన్ ప్రీతి జింటా

సీనియర్ నటి, ఐపిఎల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ఇటీవల దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. వారం క్రితం లాస్ ఏంజిల్స్ నుండి దుబాయ్ కి చేరుకున్న ఆమె ఇప్పుడు క్వారంటైన్ లోనే ఉన్నారు. ఇక హోటల్ గదిలో ఉన్న ప్రీతి తన కోవిడ్ టెస్టులు గురించి ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో తెలిపింది.

గత వారం నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల్లో నాకు నెగిటివ్ వచ్చింది. ఇప్పటికే ఏడు రోజులు ముగియడంతో ఎంతగానో సంతోషిస్తున్నాను. కానీ కొంచెం భయంగా, ఆందోళనగా ఉంది. కానీ నేను రేపు బయటకు వెళ్లబోతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. నేను నిజంగా ఎవరినీ కలవకపోయినా, కోవిడ్ పరీక్షలు జరగడం అలాగే క్వారంటైన్ లో ఉండడం నెర్వస్ గా ఉంది. ఈ ఆందోళన భయం ఎందుకో తెలియదు. మళ్ళీ పరీక్షలు నిర్వహించిన కూడా నెగెటివ్‌ వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంటుంది.. అని ప్రీతి జింటా తన వీడియోలో తెలిపింది.

Preity Zinta about covid 19 test and Quarantined In Dubai,

ఇక హోటల్ గదిలోనే టైమ్ పాస్ చేస్తున్న ప్రీతి జింటా, తన అభిమానులకు సన్నిహితంగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇలా అన్నారు. త్వరలోనే తన క్రికెట్ టీమ్ సభ్యులతో కలిసి ఒక స్పెషల్ వీడియను షూట్ చేయబోతున్నట్లు తెలిపారు. రేపే నా ప్రయాణం మొదలవుతుంది. ఇప్పటివరకు కరోనా పరీక్షల్లో ఎక్కువగా నెగిటివ్ అనే వచ్చింది. ఇక మ్యాచ్ లు స్టార్ట్ కావడానికి ఇంకొంత సమయం ఉంది కాబట్టి తప్పకుండా షూటింగ్ కి సమయం దొరుకుతుందని ప్రీతి వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X