For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సిగరెట్లు కాల్చి ముఖంపై కొట్టాడు.. గదిలో బంధించి.. చంపుతానని బెదిరించాడు.. ప్రీతి జింటా

  |

  బాలీవుడ్ నటి ప్రీతిజింటా, ప్రముఖ పారిశ్రామిక వేత్త నెస్ వాడియా మధ్య ప్రేమాయణం ఎడతెగని సీరియల్‌ మాదిరిగా సాగింది. వారిద్దరు కలిసి ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టును కొనుగోలు చేసిన తర్వాత వారిద్దరూ డేటింగ్ చేయడం మీడియాలో హాట్ హాట్‌గా చర్చ జరిగింది. అంతా సవ్యంగా సాగిపోతున్నదని అనుకొంటున్న సమయంలో వారిద్దరి మధ్య బ్రేకప్ జరగడం.. అది పోలీసుల కేసుల దాకా వెళ్లడంతో ఆ ఎపిసోడ్ మీడియాలో రంజుగా కొనసాగింది. అయితే ఆ క్రమంలో అప్పట్లో ప్రీతిజింటా చేసిన దారుణమైన కామెంట్లు ఇలా..

  ఐపీఎల్ మ్యాచ్ తర్వాత వివాదం

  ఐపీఎల్ మ్యాచ్ తర్వాత వివాదం

  ప్రీతిజింటా, నెస్ వాడియా మధ్య అఫైర్‌కు 2014 మే 30న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన చిచ్చు పెట్టింది. ఆ మ్యాచ్ తర్వాత తన చేయిని పట్టుకొని దురుసుగా నెస్ ప్రవర్తించారని, టీమ్ సభ్యుల ముందు తనపై దుర్బాషలాడారని ప్రీతీ జింటా ఆరోపణలు చేయడం అప్పట్లో సంచలనం రేపింది.

  నెస్ వాడియాపై ప్రీతీ జింటా ఫిర్యాదు

  నెస్ వాడియాపై ప్రీతీ జింటా ఫిర్యాదు

  మా మధ్య అవగాహన లోపించింది. జట్టు మేనేజ్‌మెంట్ విషయంలో మా మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ క్రమంలోనే స్టేడియంలో మా మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో దారుణమైన పదజాలంతో నన్ను తిట్టారు. నెస్ వాడియాను నోరు పారేసుకోవద్దని నేను హెచ్చరించాను. అయితే తన పద్దతి మార్చుకోలేదు. నన్ను మానసికంగా క్షోభకు గురిచేశారు అని ప్రీతి జింటా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

  చంపుతానని బెదిరించారు..

  చంపుతానని బెదిరించారు..

  అంతేకాకుండా నెస్ వాడియాపై ప్రీతి జింటా తన ఫిర్యాదులో తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనను మట్టుబెడుతానని బెదిరించారు. తనను కనిపించకుండా చేస్తానని హెచ్చరించారు. ఆయన పలుకుబడి ఉన్న వ్యక్తి అనే కారణంగా నెస్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాను. నా జీవితంలో ఎలాంటి గొడవలు లేకుండా శాంతిగా బతుకాలని భావించాను. కానీ ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఘటన నా జీవితానికి ముప్పుగా మారింది అని ప్రీతి జింటా వెల్లడించారు.

  నా ప్రాణాలకు ముప్పుంది

  నా ప్రాణాలకు ముప్పుంది

  నెస్ వాడియాతో వివాదం నేపథ్యంలో ముంబై పోలీస్ కమిషనర్‌ రాకేష్ మారియాకు లేఖ రాసి.. తన ప్రాణాలకు ముప్పు ఉంది. ఆయన నాతో చాలా ఉక్రోశం, హింసాత్మకంగా వ్యవహరిస్తున్నారు. సిగరెట్లు కాల్చి నా ముఖంపైన విసిరికొడుతున్నారు. గదిలో బంధించి వేధిస్తున్నారు. నాపై చేయి కూడా చేసుకొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇక్కడ ఉండటం సరికాదు. కావున నాకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి అంటూ లేఖలో పేర్కొన్నారు.

  నన్ను చంపేందుకు సైతం..

  నన్ను చంపేందుకు సైతం..

  నెస్ వాడియాకు దూరంగా ఉంటే నాకు జీవితంలో మనశాంతి ఉంటుంది. లేకపోతే నా జీవితంలో దుర్దినం చోటుచేసుకొనే ప్రమాదం ఉంది. నన్ను చంపడానికైనా సిద్ధంగా ఉన్నాడు. నాపై అంతగా కసి పెంచుకొన్నాడు అని ప్రీతి జింటా ఆరోపణలు చేసింది. అయితే తనపై ప్రీతి చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఆమె చెప్పిన మాటల్లో నిజం లేదు అని నెస్ వాడియా ఖండించారు.

  వివాదానికి పరిష్కారం అలా..

  వివాదానికి పరిష్కారం అలా..


  ఇలాంటి విభేదాలు, శతృత్వం దిశగా దారి తీసిన వారి మధ్య వివాదానికి 2018లో ముగింపు దొరికింది. బాంబై హైకోర్టు సూచన మేరకు కోర్టు బయట వారు తమ వివాదాన్ని పరిష్కరించుకొన్నారు. ఈ వివాదం కొనసాగిన సమయంలోనూ, ప్రస్తుతం కూడా వారిద్దరూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు సహ యజమానులుగా కొనసాగడం కొసమెరుపు కావడం గమనార్హం.

  English summary
  Bollywood Actress Preity Zinta made serious allegation on Ness Wadia. He complained to mumbai police that I just want him to be kept away from me so I can live in peace.he will kill me and that really scares me.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X