twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మేము అడ్డుకోలేదు.. భేషరుతుగా సారీ చెప్పాలి.. ప్రితీ జింటాకు రివర్స్ షాక్..

    |

    తనను గో ఎయిర్ విమానంలో ఎక్కకుండా అడ్డుకొన్నారని ప్రతీ జింటా చేసిన కామెంట్లకు పారిశ్రామిక వేత్త నెస్ వాడియా సిబ్బంది వివరణ ఇచ్చారు. ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లే విమానంలో ఎక్కకుండా నిరోధించారన్న వ్యాఖ్యలను గో అయిర్ సిబ్బంది తప్పుపట్టారు. గో ఎయిర్ విమానంలో ప్రయాణించకుండా నిషేధం విధించారన్న వార్తల్లో నిజం లేదు అని వివరణ ఇచ్చారు. అలాంటి ఆదేశాలు జారీ చేయలేదని వారు స్పష్టం చేశారు. అలాంటి వార్తలను ప్రచురించిన మీడియా భేషరతుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

    ప్రీతి జింటాకు సంబంధించిన వార్తపై క్లారిటీ ఇస్తూ ఓ ప్రకటనను జారీ చేసింది. మార్చి 30న ముంబై నుంచి చంఢీగడ్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా గో ఎయిర్ విమానంలోనే వెళ్లారు. గో ఎయిర్ విమానంలోనే మళ్లీ తిరుగు ప్రయాణానికి సంబంధించి టికెట్లను బుక్ చేసుకొన్నారు అని పేర్కొన్నారు.

     Preity Zinta was not stopped from boarding: GoAir flight

    2015లో వాంఖడే స్టేడియంలో ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్బంగా తనతో ప్రియుడు నెస్ వాడియా అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అని ప్రీతి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నెస్ తండ్రి కోరిక మేరకు ఆమె కేసు ఉపసంహరించుకొన్నారు. కానీ నెస్ వాడియా, ప్రీతి జింటా మధ్య విభేదాలు అలానే ఉన్నాయనే విషయం మీడియాలో వస్తున్నాయి. కొద్దికాలం నెస్‌తో డేటింగ్ చేసిన ప్రీతి ఇటీవల విదేశీయుడిని పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే.

    English summary
    Couple of days back, Bollywood actress Preity Zinta headed to Mohali for Kings XI Punjab’s match, was told she couldn’t board the flight owned by her former boyfriend, Ness Wadia. The animosity between Zinta and Wadia goes back to 2014 when Preity had filed a case against him for allegedly abusing her at the Wankhede stadium.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X