»   » మాజీ ప్రియుడిని క్షమించి వదిలేసిన సీనియర్ హీరోయిన్!

మాజీ ప్రియుడిని క్షమించి వదిలేసిన సీనియర్ హీరోయిన్!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    అందాల తార ప్రీతి జింతా 2014 ఐపీఎల్ సీజన్ సందర్భంగా తన మాజీ ప్రియుడు నెస్ వాడియాపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ కేసు పెద్ద సంచలనమే సృష్టించింది. దీనితో నెస్ వాడియా పెద్ద చిక్కుల్లో పడ్డాడని అంతా భావించారు. ఎట్టకేలకు ఈ కేసు ముగిసింది. ప్రీతి జింతా, నెస్ వాడియా మాజీ ప్రేమికులు. ఐపీఎల్ పంజాబ్ జట్టుకు కో ఓనర్స్ గా కూడా ఉన్నారు.

     వేధింపులతో

    వేధింపులతో

    2014 మే 30న పంజాబ్, చెన్నై మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ టికెట్స్ పంపిణి విషయంలో వాడియా సిబ్బందిని దూషిస్తుండడంతో ప్రీతి జింతా అడ్డుకుంది. అప్పటి నుంచి తనని తిడుతూ, లైంగికంగా వేధిస్తున్నాడని ప్రీతి జింతా వాడియాపై పిర్యాదు చేసింది.

    కనిపించకుండా చేస్తా

    కనిపించకుండా చేస్తా

    నువ్వు కేవలం ఒక నటివి. నేను తలచుకుంటే నిన్ను కనిపించకుండా చేస్తా. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని నెస్ వాడియాపై ప్రీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనితో పలు సెక్షన్ల కింద నెస్ వాడియాపై కేసు నమోదైంది.

    నాలుగేళ్లుగా

    నాలుగేళ్లుగా

    నాలుగేళ్లుగా ఈ కేసు కొనసాగుతూనే ఉంది. కేసు నమోదు కావడంతో తాను విదేశాలు కూడా వెళ్ళలేకున్నానని వాడియా ఇటీవల కోర్టులో మొరపెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో కోర్టు ఆంక్షల వలన ఇబ్బందులు ఎదురవుతుండడంతో సామరస్యంగా పరిష్కారించుకోవాలని భావించాడు. గత కొన్ని నెలలుగా ప్రీతీ జింతతో నెస్ వాడియా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

    క్షమాపణలు చెప్పడంతో

    క్షమాపణలు చెప్పడంతో

    నెస్ వాడియా ప్రీతి జింతాకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పడంతో ఇద్దరూ రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రీతి జింతా వాడియాపై నమోదు చేసిన కేసు వెనక్కి తీసుకోవడంతో ఈ వివాదం ఇంతటితో ముగిసింది. బాంబే హై కోర్టు తాజగా ఈ కేసుని కొట్టివేసింది.

    English summary
    Preity Zinta withdraws molestation case against Ness Wadia after his apology. Preity Zinta had filed a complaint against Ness Wadia on June 13, 2014
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more