twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్కడ రాధేశ్యాంను వెనక్కి నెట్టిన ది కాశ్మీర్‌ ఫైల్స్.. ధైర్యం చూపారు అంటూ ప్రధాని మోడీ అభినందనలు

    |

    అనుపమ్ ఖేర్ ప్రధాన నటించిన 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమాకు మంచి రివ్యూలు వస్తున్నాయి. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా ప్రజలకే కాదు, ప్రధాని నరేంద్ర మోదీకి కూడా బాగా నచ్చింది. దీంతో ఆయన స్వయంగా ఈ సినిమా బృందాన్ని రప్పించుకుని మరీ శుభాకాంక్షలు తెలిపారు. ఆ వివరాల్లోకి వెళితే

    కళ్ళకు కట్టినట్టు

    కళ్ళకు కట్టినట్టు

    టాలీవుడ్ లో కిరాక్ పార్టీ, గూఢచారి, సీత, ఏ1 ఎక్స్ ప్రెస్, రాజరాజ చోర నిర్మించి ప్రస్తుతం కార్తికేయ 2 సినిమాను నిర్మిస్తున్న నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మించిన తాజా చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్. ప్రస్తుతం ఎక్కడ చూసినా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ 'ది కాశ్మీర్ ఫైల్స్' గురించే చర్చ జరుగుతోంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కాశ్మీరీ పండిట్ల బాధను కళ్ళకు కట్టినట్టు చూపింది.

    ప్రధాని మోదీని

    ప్రధాని మోదీని

    ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించడం మొదలుపెట్టగా అనేక మంది నుంచి సినిమా మీద ప్రశంశల వర్షం కురుస్తోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా సినిమాను ప్రశంసించారు. ఇటీవల దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్ అగర్వాల్, నటి పల్లవి జోషి ప్రధాని మోదీని కలిశారు. 'ది కాశ్మీర్ ఫైల్స్'తో పాటు చిత్ర బృందాన్ని మోదీ ప్రశంసించారు.

    ధన్యవాదాలు మోడీ జీ

    ధన్యవాదాలు మోడీ జీ

    ప్రధాని మోదీతో మేకర్స్ సమావేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిషేక్ అగర్వాల్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ప్రధాని మోదీని కలిసిన కొన్ని చిత్రాలను పంచుకున్నారు.'మన గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీని కలవడం చాలా గొప్ప విషయం. 'ది కాశ్మీర్ ఫైల్స్' కోసం ఆయన మాట్లాడిన మాటలు ఈ సమావేశానికి మరింత ప్రత్యేకం. ఈ చిత్రాన్ని నిర్మించినందుకు గర్విస్తున్నాం. ధన్యవాదాలు మోడీ జీ అని పేర్కొన్నారు.

    గొప్ప విషయం

    గొప్ప విషయం

    అదే సమయంలో, వివేక్ అగ్నిహోత్రి కూడా ఒక ట్వీట్‌లో ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతూ అభిషేక్‌ను ప్రశంసించారు. 'ది కాశ్మీర్ ఫైల్స్' కశ్మీరీ పండిట్‌లను 90వ దశకంలో వారి స్వంత రాష్ట్రం నుంచి బహిష్కరించిన సమయంలో వారు ఎలాంటి బాధలు పడ్డారు ? ఎంత క్షోభ అనుభవించారు అనే విషయాన్ని ఎక్కువ ప్రస్తావించింది. ఈ అంశంపై సినిమా తీయడానికి నిర్మాతలు ధైర్యం చూపించడం గొప్ప విషయం అని ప్రధాని మోదీ ప్రశంసించారు. కాశ్మీర్ ఫైల్స్‌లో అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పునీత్ ఇస్సార్, మృణాల్ కులకర్ణి మరియు మిథున్ చక్రవర్తి తదితరులు నటించారు.

    తగిన లాభాలను

    తగిన లాభాలను

    మార్చి 11న విడుదలైన ఈ చిత్రం తొలిరోజు 3.50 కోట్ల రూపాయల బిజినెస్ చేసి బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టిందని టాక్. ఈ సినిమా కేవలం 700 స్క్రీన్లలో విడుదలైంది. వసూళ్ల పరంగా పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లలో ప్రభాస్ రాధే శ్యామ్‌ని కూడా ఓడించింది. రానున్న రోజుల్లో ఈ సినిమా మౌత్ టాక్‌కి తగిన లాభాలను అందుకుంటుందని భావిస్తున్నారు.

    English summary
    Prime Minister Narendra Modi congratulates makers of 'The Kashmir Files'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X