చంపేస్తాం.. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్‌కు బెదిరింపులు!

'పీఎం నరేంద్రమోదీ' బయోపిక్‌లో ప్రధాన పాత్ర పోషించిన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌ను చంపేస్తామని నక్సలైట్లు నుంచి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం శుక్రవారం(మే 24)న విడుదలవుతున్న నేపథ్యంలో ఆయన్ను బెదిరిస్తూ ఫోన్స్ రావడంతో పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు.

'పీఎం నరేంద్రమోదీ' చిత్రం ఏప్రిల్ 5న విడుదలవ్వాల్సి ఉండగా... ఎన్నికల కారణంగా రిలీజ్ అనుమతి లభించలేదు. ఈ మూవీ ఓటర్లపై ప్రభావం చూపుతుందనే కారణంతో ఈసీ విడుదలను నిలిపి వేసింది. ఇప్పుడు అన్నీ క్లియర్ కావడంతో మే 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

Prime Minister Narendra Modi movie effect: Vivek Oberoi receives death threats

సందీప్‌ సింగ్‌ నిర్మాతగా ఓమంగ్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రధాని మోదీ పాత్రను వివేక్‌ ఓబెరాయ్‌ పోషించారు. మోదీ బాల్యం నుంచి ప్రధానమంత్రి అయ్యే వరకు జరిగిన ముఖ్య ఘట్టాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. వివేక్ ఒబెరాయ్‌‌తో పాటు దర్శన్ కుమార్, బోమన్ ఇరానీ, మనోజ్ జోషి, ప్రశాంత్ నారాయణన్, జరీనా వాహెబ్, బర్ఖా బిస్త్ సేన్ గుప్తా, అంజన్ శ్రీవాస్తవ్, యతిన్ కార్యేకర్, రాజేంద్ర గుప్తా, అక్షత్ ఆర్ సలుజా, ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ సినిమాలో నటించడంతో పాటు పలు రాజకీయమైన అంశాలతో వివేక్ ఒబెరాయ్ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల కమల్ హాసన్ మాట్లాడుతూ... ఈ దేశంలో మొదటి టెర్రరిస్్ హిందూ అంటూ కామెంట్ చేయడంపై వివేక్ రియాక్ట్ అవుతూ... కమల్ హాసన్ దేశాన్ని విడగొట్టలేరని స్పష్టం చేశారు. మరో మైపు మోదీపై విమర్శలు చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరుపై కూడా వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X