twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అతిలోక సుందరి ముద్దు, ఆటోగ్రాఫ్.. గాల్లో తేలిపోయిన ‘లీడర్’ పిల్ల!!

    |

    లీడర్ ఫేమ్ ప్రియా ఆనంద్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ చిత్రంతో ప్రియకు మంచి పేరు వచ్చింది. అల్లరి పిల్లగా, చలాకీ పాత్రకు సరిగ్గా సరిపోయింది. లీడర్ తరువాత తెలుగులో మంచి ఆఫర్స్ వచ్చాయి. రామరామ కృష్ణకృష్ణ, 180 వంటి సినిమాల్లో నటించింది. అయితే ప్రియ తెలుగులో అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక శ్రీదేవీతో కలిసి నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో ప్రియ మళ్లీ గుర్తింపు తెచ్చుకుంది. నేడు శ్రీదేవీ జయంతి సందర్భంగా నాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంది.

    శ్రీదేవీ సెకండ్ ఇన్నింగ్స్ ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో అదిరిపోయింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. శ్రీదేవీ నటనకు అంతా ఫిదా అయిపోయారు. తలా అజిత్ ప్రత్యేక పాత్రలో మెప్పించాడు. అందులో ప్రియ కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషించింది. అయితే ఈ సినిమా విశేషాలను, శ్రీదేవీతో ఉన్న అనుభవాలను ప్రియా తాజాగా అందరితో పంచుకుంది.

     Priya Anand About Sridevi Birth Anniversary

    శ్రీదేవి జయంతి సందర్భంగా ఇంగ్లీష్ వింగ్లీష్ నాటి చిత్రాలను షేర్ చేసింది ప్రియా ఆనంద్. 'లెజెండరీ నటి అయిన శ్రీదేవీని ప్రతీ రోజు గుర్తుకు చేసుకుంటూనే ఉంటాను. నా జీవితంలో ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రానికే అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. ఓ ఫ్యాన్‌గా ఆమె ఆటోగ్రాఫ్‌ను ఎప్పటికీ మరిచిపోలేను' అంటూ శ్రీదేవి ముద్దు పెడుతున్న ఫోటోను షేర్ చేసింది. ఇక నేడు సినీ ప్రముఖులందరూ శ్రీదేవిని స్మరించుకుంటున్నారు. బోనీ కపూర్, జాన్వీ కపూర్ తెగ ఎమోషనల్ అయ్యారు.

     Priya Anand About Sridevi Birth Anniversary

    English summary
    Priya Anand About Sridevi Birth Anniversary. Remembering the legend today & everyday! #EnglishVinglish will forever be one of the biggest highlights of my life! The only autograph I sought was of SrideviBKapoor Fan girl for life!!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X