twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకింగ్ టీజర్: ప్రియా వారియర్ బాలీవుడ్ డెబ్యూ మూవీలో శ్రీదేవి డెత్ సీన్?

    |

    వింక్ గర్ల్‌గా దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన కేరళ ఇంటర్నెట్ సంచలనం ప్రియా ప్రకాష్ వారియర్ 'శ్రీదేవి బంగ్లా' అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి టీజర్ తాజాగా విడుదలైంది. అయితే ఈ టీజర్లో చూపించిన సన్నివేశాలు హిందీ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యాయి.

    ఒక నిమిషం 49 సెకన్ల నిడివిగల ఈ టీజర్లో ప్రియా వారియర్ గ్లామరస్ అవతార్, తక్కువ సమయంలోనే పెద్ద సినీ స్టార్‌గా ఎదిగినట్లు చూపించారు. అయితే టీజర్ చివర్లో చూపించిన ఓ సీన్ చాలా మందికి అతిలోక సుందరి శ్రీదేవిని గుర్తు చేసింది.

    శ్రీదేవి అనే పాత్ర చుట్టూ...

    శ్రీదేవి అనే పాత్ర చుట్టూ...

    శ్రీదేవి అనే పాత్ర చుట్టూ ఈ మూవీ సాగుతుంది. 'ఓ నటిగా తాను కోరుకున్న పేరు, డబ్బు, సంతోషం, అభిమానులు అన్నీ దేవుడు ఇవ్వడంతో చాలా అదృష్టవంతురాలిని అని ఆమె ఫీలయ్యేలోపే అనుకోని సమస్య.... అదేమిటనేది సస్పెన్స్ రేకెత్తిస్తూ ఈ టీజర్ కట్ చేశారు.

    శ్రీదేవి డెత్ సీన్

    శ్రీదేవి డెత్ సీన్

    అతిలోక సుందరి శ్రీదేవి దుబాయ్‌లో హోటల్‌లో బాత్ టబ్‌లో పడిపోయి చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన టీజర్లో ప్రియా వారియర్ శ్రీదేవి పేరుగల పాత్రలో నటించడం, బాత్ టబ్‌లో పడి చనిపోయినట్లు చూపించడంతో... అందరికీ ఒక్కసారిగా గతేడాది జరిగిన విషాద సంఘటన గుర్తు చేసింది.

    శ్రీదేవి జీవితం గురించి కాదు...

    శ్రీదేవి జీవితం గురించి కాదు...

    ‘శ్రీదేవి బంగ్లా' మూవీ నటి శ్రీదేవి జీవితం గురించి కాదనే అనేది విస్పష్టం. అయితే అతిలోక సుందరిని గుర్తు చేసేలా పాత్రకు ఆమె పేరు పెట్టడం, ఫిల్మ్ స్టార్‌గా చూపించడం, కొన్ని సీన్లు యాడ్ చేయడం ద్వారా సినిమాపై ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు.

    శ్రీదేవి బంగ్లా

    ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చంద్రశేఖర్ ఎస్.కె, ఎంఎన్ పింపుల్ నిర్మించారు. త్వరలోనే ఈ మూవీ డేట్ ప్రకటించనున్నారు. కాగా... ప్రియా వారియర్ నటించిన తొలి చిత్రం తెలుగులో ‘లవర్స్ డే' టైటిల్‌తో ఫిబ్రవరి 14న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    The teaser of Priya Prakash Varrier's film Sridevi Bungalow dropped in recently and ever since it did, the teaser has become the subject of discussion in the Hindi film industry. This film is directed by Malayalam film-maker Prasanth Mambully and is reportedly made in the budget of Rs 70 crore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X