ప్లాపులు, వివాదాలు... అయినా తగ్గని ప్రియా వారియర్ క్రేజ్, మరో ఛాన్స్ కొట్టేసింది!
Recommended Video
ఇంటర్నెట్ సెన్సేషన్ ప్రియా వారియర్ బాలీవుడ్లో మరో అవకాశం దక్కించుకుంది. ఆమె నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ 'శ్రీదేవి బంగ్లా' ఇంకా రిలీజ్ కాకముందే మరో సినిమాకు సైన్ చేసింది. 'లవ్ హ్యాకర్స్' పేరుతో రూపొందే ఈ చిత్రానికి మయాంక్ ప్రకాష్ శ్రీవాస్తవ దర్శకత్వం వహిస్తున్నారు. సైబర్ క్రైమ్స్ సంబంధిత అంశాలతో ఈ చిత్రం తెరకెక్కనుంది.
'లవ్ హ్యాకర్స్' మూవీ మే నెల చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. లక్నో, ఢిల్లీ, గుర్గావ్, ముంబైలో షూటింగ్ ప్లాన్ చేశారు. ఈ సినిమాలో తన పాత్ర గురించి ప్రియా వారియర్ మాట్లాడుతూ... 'ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాను. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కథ సాగుతుంది.' అన్నారు.

ప్రియా వారియర్
మలయాళ చిత్రం ‘ఓరు అడర్ లవ్' మూవీతో నటిగా కెరీర్ మొదలు పెట్టిన ప్రియా వారియర్ ఇందులోని కన్నుగీటే సీన్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వింక్ గర్ల్‌గా పాపులర్ అయింది. తాను రాసుకున్న కథకు ప్రియా వారియర్ యాప్ట్ అవుతుందనే ఎంపిక చేసినట్లు ‘లవ్ హ్యాకర్స్' చిత్ర దర్శకుడు మయాంక్ ప్రకాష్ శ్రీవాస్తవ తెలిపారు.

సైబర్ క్రైమ్స్ మీద అవగాహన కల్పించే విధంగా
‘ఈ రోజుల్లో చాలా మంది సోషల్ మీడియా, ఇంటర్నెట్ వాడుతున్నారు. ఈ క్రమంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. సైబర్ క్రైమ్స్ మీద చాలా మందికి సరైన అవగాహన లేదు. ఇలాంటి అంశాలను చర్చిస్తూ మా సినిమా ఉంటుంది. సైబర్ క్రైమ్స్ విషయంలో ప్రజల్లో చైతన్యం నింపే విధంగా ‘లవ్ హ్యాకర్స్' చిత్రం ఉండబోతోంది' అని దర్శకుడు వెల్లడించారు.

శ్రీదేవి బంగ్లా మూవీపై వివాదం
ప్రియా వారియర్ బాలీవుడ్లో సైన్ చేసిన తొలి చిత్రం ‘శ్రీదేవి బంగ్లా'. ప్రశాంతి మాంబుల్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియా సినీ నటి పాత్రలో కనిపించబోతోంది. ఇటీవల విడుదలైన టీజర్లో బాత్ టబ్‌లో పడి నటి చనిపోయినట్లు చూపించారు. దీంతో ఈ చిత్రం ద్వారా ప్రముఖ నటి శ్రీదేవి మరణాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం జరుగుతుందంటూ వివాదం రేగిన సంగతి తెలిసిందే.

తొలి చిత్రం ప్లాప్
ప్రియా వారియర్ నటించిన తొలి చిత్రం ‘ఓరు అడర్ లవ్' మూవీ తెలుగులో ‘లవర్స్ డే' పేరుతో విడుదలైంది. ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ మలయాళ అనువాద చిత్రం తెలుగులో ప్లాప్ అయింది. ఇతర భాషల్లో కూడా ఆశించిన ఫలితాలు రాలేదు. ఇది విజయాన్ని ఇవ్వక పోయినా ప్రియా వారియర్ ఇంత పాపులారిటీ సంపాదించుకోవడానికి ప్రధాన కారణమైంది.


Click it and Unblock the Notifications











