Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మాజీ లవర్స్‌కు షాకిచ్చి.. నేలపైనే రొమాన్స్ చేస్తూ.. అఫైర్ కన్ఫర్మ్!
హిందీ వినోద పరిశ్రమలో తారల మధ్య రిలేషన్స్‌కు కొదవేమీ ఉండదు. సెలబ్రిటీల మధ్య రూమర్లు, గాసిప్సు ఏకధాటిగా వస్తూనే ఉంటాయి. గతంలో బిగ్‌బాస్ 11 సీజన్లో ప్రేక్షకులను ఆకట్టుకొన్న ప్రియాంక్ శర్మ, బెనఫ్షా సూనావాలా మధ్య రొమాన్స్ మీడియాలో విపరీతమైన చర్చకు దారి తీసింది. వారిద్దరూ రిలేషన్ షిప్ గురించి కథలు కథలుగా చెప్పుకొన్నారు. తమపై వస్తున్న రూమర్లకు తెరదించే ప్రయత్నం చేస్తూ వారిద్దరి రొమాన్స్‌కు దిగారు. తమ మధ్య ఉన్న బంధాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
తమ రిలేషన్‌ను ఇలా..
తన ప్రియురాలు బేనఫ్షాతో ఉన్న రిలేషన్‌షిప్‌ను ఇన్స్టాగ్రామ్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఫ్లోర్‌పై పడుకొని తన చెంపపై ముద్దు పెడుతున్న ఫొటోను ప్రియాంక్ శర్మ షేర్ చేశారు. మా మధ్య ఉన్న రిలేషన్షిప్ ఇదే కన్ఫర్మేషన్ అంటూ ఎమోజీని పోస్టు చేశారు. దాంతో తమపై వస్తున్న రూమర్లకు చెక్ చెప్పారు.
ఇప్పటి వరకు నీ మాదిరిగా..
ప్రియాంక్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు గురించి బెనఫ్షా సూనావాలా స్పందిస్తూ.. ఇప్పటి వరకు నిన్ను ఇష్టపడినట్టు మరొకరి ఇష్టపడలేదు. ఇది సంప్రదాయానికి విరుద్దంగా ఉన్నప్పటికీ.. నా ప్రేమ చాలా స్వచ్ఛమైనది అంటూ ప్రియురాలి పోస్టుకు బదులిచ్చారు. దాంతో ప్రియురాలి ప్రపొజల్స్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయింది.
గాఢమైన రిలేషన్లో
ప్రియాంకా, బెనఫ్షా సూనావాలా ఇద్దరి మధ్య గాఢమైన రిలేషన్ గతకొద్దికాలంగా సాగుతున్నది. రోడీస్, స్పిట్ విల్లాలో వారిద్దరు భాగమయ్యారు. అప్పటి నుంచి వారిద్దరూ చాలా దగ్గరయ్యారు. ఒకరి నుంచి మరొకరిని విడదీయలేని విధంగా డేటింగ్ చేశారు. ప్రస్తుతం తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు.
Recommended Video
|
అఫైర్‌కు మాజీలకు ఝలక్
అయితే ప్రియాంక్ శర్మ కంటే ముందు బెనఫ్షా సూనావాలాకు మరో అఫైర్ ఉండేది. స్ల్పిట్విల్లాలోని తన సహనటడు వరుణ్ సూద్‌తో కొన్ని రోజులు ప్రేమాయణం నడిపారనే వార్తలు వచ్చాయి. వారిద్దరి రిలేషన్ ముదురుతుండగానే బ్రేకప్ అయిందని చెప్పుకొంటారు. అలాగే ప్రియాంక్ కూడా బిగ్ బాస్ 2 సెలబ్రిటీ దివ్య అగర్వాల్‌తో అఫైర్ ఉండేది. బయటకు రాని కారణాల వల్ల వీరిద్దరి బ్రేకప్ జరిగింది.