Don't Miss!
- News
కోటంరెడ్డి కీలక నిర్ణయం - రిటర్న్ గిఫ్ట్..!!
- Finance
Infosys: ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ ఝలక్..! ఉద్యోగాల తొలగింపు.. ఆ టెక్నిక్ వాడుతూ..
- Travel
వైజాగ్ సమీపంలోని సందర్శనీయ పర్యాటక ప్రదేశాలు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Sports
INDvsAUS : స్పిన్నర్ల ఎంపికపై ఆసీస్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Priyanka Chopra: 20 ఏళ్ళ క్రితం బికినీ ఫొటో చూసి భర్త ఫిదా.. నిక్ జోనస్‌ను ఎలా ట్రోల్ చేశారో మీరే చూడండి
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొన్నేళ్ల వరకు అగ్రహీరోయిన్ గా కొనసాగిన ప్రియాంక చోప్రా ఆ తర్వాత బాలీవుడ్ వైపు కూడా అడుగులు వేసిన విషయం తెలిసిందే. పలు ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ లతో కూడా గుర్తింపు అందుకున్న ఈ బ్యూటీ నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక ఫోటో తో నెటిజన్లను ఆకర్షిస్తూనే ఉంటుంది. అయితే రీసెంట్ గా ప్రియాంక చోప్రా 20 ఏళ్ల క్రితం నాటి ఒక బికినీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇక ఆ ఫొటో పై ఫోటో తన భర్త ఒక కామెంట్ చేయడంతో అతనిపై ట్రోలోంగ్ గట్టిగానే చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

సినిమాల్లోకి రాకముందే
మొదట మోడల్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ప్రియాంక చోప్రా ఎంతో కష్టపడి హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా అవకాశాలను అందుకుంది. ఇక మొదట్లో ఈ బ్యూటీ మోడలింగ్ ప్రపంచంలో కూడా తనదైన శైలిలో ఓ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంది. అప్పట్లో సినిమాల్లోకి అడుగుపెట్టక ముందే ప్రియాంక చోప్రా బికినీ ఫోటోలతో పలు మ్యాగజైన్స్ లో కూడా దర్శనమిచ్చింది.

అగ్ర హీరోలతో..
మోడలింగ్ ప్రపంచంలో గుర్తింపును అందుకున్న తర్వాత ప్రియాంక చోప్రా హిందీ పరిశ్రమలో మొదట్లోనే అగ్రహీరోలతో నటించే అవకాశం అందుకుంది. ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 15 ఏళ్ల వరకు కూడా తన స్టార్ ఇమేజ్ ను అదే తరహాలో కొనసాగించింది. ప్రస్తుతం ఉన్న అగ్ర హీరోలందరితో కూడా ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంది. తెలుగులో రామ్ చరణ్ తో కూడా జంజీర్ రీమేక్ లో నటించిన విషయం తెలిసిందే.

సింగర్ తో వివాహం
ఇక తన కంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా చాలా వరకు హాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది. ఎక్కువగా అమెరికన్ వెబ్ సిరీస్ ల తో కూడా ఆమె అక్కడి జనాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఇక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో కూడా ప్రియాంక చోప్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ప్రయత్నం చేస్తోంది.

20 ఏళ్ళ క్రితం బికినిలో..
అయితే రీసెంట్ గా ప్రియాంక చోప్రా ఒక వింటేజ్ బికినీ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. 2000 సంవత్సరం నాటి ఆ ఫోటో స్టిల్ లో ప్రియాంక చోప్రా అందమైన క్యూట్ ఫేస్ తో ఇండియన్ మోడ్రన్ స్టైల్ స్టిక్కర్ ను బొట్టుగా పెట్టుకొని దర్శనమిచ్చింది. ఇక బ్రా అందాలతో కూడా ఈ బ్యూటీ స్టన్ అయ్యేలా చేసింది. ఇక ఆ ఫోటో అద్భుతంగా ఉంది అంటూ ప్రముఖ బాలీవుడ్ తారలు చాలామంది పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

అప్పుడు నీ వయసు 8
అయితే ఆ ఫోటోపై ప్రియాంక భర్త నిక్ కామెంట్ బాక్స్ లో ఫైర్ అని వివరణ ఇవ్వడంతో అందరు కూడా అతను చేసిన కామెంట్స్ పై ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఎందుకంటే 2000 సంవత్సరం అంటే అప్పుడు నీ వయసు ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి అని అప్పుడు నువ్వు ఒక చిన్న పిల్లాడివి అని అతను ఇచ్చిన రిప్లై కు ప్రతి స్పందిస్తున్నారు. ఇది వరకే చాలాసార్లు వీరి వివాహం పై అనేక రకాల మీమ్స్ వైరల్ అయ్యాయి. అయినప్పటికీ కూడా ఈ జంట వాటి గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా వారి మ్యారేజ్ లైఫ్ ను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.