అలాంటి డ్రెస్‌లో చూసి నాన్న షాక్.. ఎనిమిదో క్లాస్‌లోనే అన్ని.. సీక్రెట్స్ బయట పెట్టేసిన ప్రియాంక
బాలీవుడ్ టు హాలీవుడ్ పయనమైన స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. అంతర్జాతీయ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. హాలీవుడ్ సింగర్ నిక్ జొనాస్‌ను వివాహం చేసుకుని హాలీవుడ్‌లోనే సెటిలై పోయింది. అయితే వీరిద్దరి వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఇద్దరూ కలిసి ఒక చోట కనిపించారంటే అక్కడంతా రచ్చ రచ్చే. తాజాగా ప్రియాంక తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది.

అలా చూసి షాక్..
ఓ మీడియాతో మాట్లాడుతూ తండ్రి అశోక్ చోప్రాతో ఉన్న అనుబంధం గురించి వివరించింది. చిన్నతనంలో అంటే దాదాపు 12 ఏళ్లు ఉన్నప్పుడు అమెరికాకు వెళ్లా.. మళ్లీ పదహారేళ్లు నిండాక ఇండియాకు వచ్చానని తెలిపింది. అలా ఇండియాలో ఎంట్రీ ఇవ్వగానే తనను చూసిన తండ్రి షాక్ అయ్యాడని చెప్పుకొచ్చింది.

టైట్ దుస్తులు ఎందుకు?
వెళ్లేటప్పుడు ముద్దు ముద్దుగా ఉన్న తాను ఇండియాకు తిరిగి వచ్చేప్పుడు వేసుకున్న డ్రెస్ చూసి ఫైర్ అయ్యాడని తెలిపింది. అప్పుడు తనకు పదహారేళ్లు అని, బిగుతైన దుస్తులు ధరించి ఉన్నానని తెలిపింది. దీంతో అలాంటి బట్టలు వేసుకున్నావేంటంటూ తనపైకి అంతెత్తున లేచాడని గుర్తు చేసుకుంది.

అలా మా ఇద్దరికీ కామన్...
అలా మా ఇద్దరికీ చాలా సేపు ఘర్షణ జరిగిందంటూ నాటి సంఘటనను గుర్తు చేసుకుంది. అయితే ఎన్ని గొడవలు జరిగినా తామిద్దరం బెస్ట్‌ఫ్రెండ్స్‌లా ఉండేవారని, తమ మధ్య గొడవలనేవి కామన్ అని చెప్పుకొచ్చింది. తాను చేసింది తప్పా, ఒప్పా?, మంచా, చెడా? అనేది పక్కనపెట్టి ఏ విషయాన్నైనా సరే ముందుగా తనతో చెప్పాలనేవాడని పేర్కొంది. ప్రతీ సమస్యకు పరిష్కారం చూపిస్తాననేవారని, అంతేకానీ వెంటనే తప్పంతా నాదేనని నిందించేవాడు కాదని తెలిపింది.
Recommended Video

ఎనిమిదో క్లాస్‌లోనే అన్ని..
చిన్నతనంలో విద్యను అభ్యసించడానికి అమెరికానే ఎందుకు ఎంచుకుందో కూడా సీక్రెట్ బయట పెట్టేసింది. అక్కడి హైస్కూల్స్‌లో చదవాలని చిన్నప్పటి నుంచే కలలు కనేదంటా. పైగా అక్కడ విద్యార్థులకు సపరేట్ లాకర్ ఉంటుందని, యూనిఫామ్ ధరించాలనే నియమ నిబంధనలు ఉండవని, ఎలాగైనా రావొచ్చని, ఇష్టమొచ్చినట్టుగా మేకప్ వేసుకోవచ్చని, ఎనిమిదో క్లాస్‌లోనే ఐబ్రోస్ అంటూ అన్ని రకాలుగా ట్రై చేశానని చెప్పుకొచ్చింది. ప్రియాంక చోప్రా తండ్రి అశోక్ చోప్రా 2013లో కాలేయ క్యాన్సర్ వల్ల కన్నుమూసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











