లాక్‌డౌన్‌లో నా భర్త.. ఆ పాఠాలు నేర్పించారు.. ప్రియాంక చోప్రా
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా జోనస్ కరోనావైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ను భర్త నిక్ జోనస్‌తో కలిసి లాస్ ఎంజెలెస్‌లో గడుపుతున్నారు. స్వీయ గృహ నిర్బంధంలో ఉంటూనే రోజు వారీ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తూ అభిమానులు, సన్నిహితులతో చేరువగా ఉన్నారు. ఇక తన పెంపుడు కుక్కలు డయానా, జినోతో కాలక్షేపం చేస్తూ క్వారంటైన్ ఒత్తిడిని దూరం చేస్తూ వచ్చారు. ఇలా రెండు నెలలపాటు క్వారంటైన్‌లో ఉన్న ప్రియాంక చోప్రా ఇంటి పనులు, నిత్యావసర వస్తువుల కోసం కాలు బయటపెట్టారు.
ముఖానికి మాస్క్ ధరించి సూర్యకాంతిలో మిలమిల మెరిసే కళ్లతో దిగిన ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. పసుప పచ్చ డ్రస్‌లో జుత్తు గాలికి ఎగిరిపడుతున్న ఫోటో అభిమానులను ఎంతో ఆకట్టుకొన్నది. తన ఫోటో కింద కళ్లు ఎప్పడూ నిశ్శబ్దంగా ఉండవు. రెండు నెలల్లో తొలిసారి అడుగు బయటపెట్టాను. థ్యాంక్స్ ఫర్ మాస్క్ అంటూ ప్రియాంక షేర్ చేశారు.

లాక్‌డౌన్‌లో ఉంటూ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ.. నిక్‌కు టైప్ 1 డయాబెటిక్ పేషంట్. కాబట్టి మారు మాట్లాడకుండా వెంటనే క్వారంటైన్‌లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాం. ఇలాంటి సమయంలో మేమిద్దరం కలిసి ఉండటం ఆనందంగా ఉంది అని అన్నారు.
క్వారంటైన్ కాలంలో నా భర్త నుంచి మ్యూజిక్ నేర్చుకొన్నాను. నాకు ఆయన పియానో నేర్పించారు. దాంతో పియానో నేర్పించాలనే కోరిక తీరింది. ప్రతీరోజు 45 నిమిషాలపాటు పియానో నేర్పించారు అని ప్రియాంక చెప్పారు.


Click it and Unblock the Notifications











