ఇల్లు అమ్మేసిన ప్రియాంక చోప్రా... రూ. 140 కోట్ల ఖర్చుతో మరింత లగ్జరీగా!
అమెరికన్ నటుడు, సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లాడిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఏప్రిల్ 2018లో లాస్ ఏంజిల్స్‌లోని బేవర్లీ హిల్స్‌లో 5 బెడ్రూంలు కలిగిన భవంతి కొనుగోలు చేసి అందులో కాపురం పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఆరు నెలలు కాపురం చేసిన అనంతరం ఈ దంపతులు ఈ ఇంటిని అమ్మేశారు.
హాలీవుడ్ పత్రికల కథనం ప్రకారం... నిక్ జోనస్ ఈ ఇంటిని 6.9 మిలియన్ డాలర్ల(రూ. 48 కోట్లు)కు అమ్మేసినట్లు తెలుస్తోంది. 4,129 స్క్వేర్ ఫీట్స్ వైశాల్యంలో 5 బెడ్ రూమ్స్, స్విమ్మింగ్ ఫూల్ కలిగిన ఈ విలాసవంతమైన ఇంటిని వారు అప్పట్లో ఇష్టంగా కొనుగోలు చేశారు.

రూ. 140 కోట్లతో భవంతి కొనుగోలు చేసే ఆలోచనలో...
ఈ ఇంటిని అమ్మడానికి కారణం వారు మరింత పెద్ద ఇంట్లోకి మారాలనే ఆలోచనే కారణమని తెలుస్తోంది. 20 మిలియన్ డాలర్లు(రూ. 140 కోట్లు) ఖర్చు చేయానికి సిద్ధంగా ఉన్నారట. ఈ మేరకు వారు ఒక మంచి భవంతి కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది.

తమ స్టేటస్‌కు తగిన విధంగా
ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతులు మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్. ప్రియాంక గ్లోబల్ స్టార్ అయితే... నిక్ జోనస్ పాపులర్ సింగర్, యాకర్ట్. అందుకే తమ స్టేటస్‌కు తగిన విధంగా మరింత విలాసవంతమైన ఇంట్లోకి మారాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.

నిక్, ప్రియాంక బిజీ బిజీ
ఇటీవలే లాంగ్ హాలిడే ఎంజాయ్ చేసిన ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ మళ్లీ ఎవరి ప్రొఫెషన్లో వారు బిజీ కాబోతున్నారు. నిక్ జోనస్ తన సోదరులతో కలిసి ‘హ్యాపీనెస్ బిగిన్స్ టూర్'కు సిద్ధమవుతుండగా.... ప్రియాంక చోప్రా ‘బ్యూటీకాన్ ఎల్ఏ 2019'కు రెడీ అవుతున్నారు.

ప్రియాంక చోప్రా కంబ్యాక్ మూవీ పింక్
ప్రియాంక చోప్రా నటించిన బాలీవుడ్ మూవీ ‘పింక్' త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. 2016లో ‘జై గంగాజల్' తర్వాత ప్రియాంక బాలీవుడ్ చిత్రాలకు దూరం అయ్యారు. వరుసగా హాలీవుడ్ ప్రాజెక్టులు చేస్తూ బిజీ అయ్యారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ప్రియాంక నటిస్తున్న చిత్రం కావడంతో దీన్ని ఆమె బాలీవుడ్ కంబ్యాక్ మూవీగా పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











