కేసు పెట్టేందుకు సిద్ధం అవుతున్న ప్రియాంక చోప్రా.. పెళ్ళైన మూడు నెలలకే!

క్రేజీ హీరోయిన్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో ఓ సంచలనం. ప్రపంచ సుందరిగా అవార్డు గెలుచుకున్న తర్వాత ప్రియాంక బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. మూడు పదుల వయసులో కూడా ప్రియాంక హవా తగ్గలేదు. ప్రియాంక క్రేజ్ హాలీవుడ్ కు సైతం పాకింది. హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ప్రేమలో పడడం, గత ఏడాది డిసెంబర్ లో ఈ జంట వివాహం చేసుకోవడం అందరికి తెలిసిందే. ఇటీవల ప్రియాంక, నిక్ వివాహ జీవితం గురించి ఓ అమెరికన్ మీడియా సంచలన కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ విడాకులు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారంటూ రాసేశారు.

పెళ్ళైన మూడు నెలలకే

పెళ్ళైన మూడు నెలలకే

ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ వివాహం జరిగి మూడు నెలలు మాత్రమే గడిచింది. వీరి మధ్య బంధం మూడు నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోనుందని, విడాకులు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు అంటూ వార్తలు ఓ అమెరికన్ మీడియా సంస్థ వార్త రాసింది. ఈ వార్త సంచలనంగా మారి ప్రియాంక అభిమానులని కలవర పెట్టింది. తనపై బాధ్యతా రాహిత్యంగా అసత్య వార్తలు రాయడంతో సదరు మీడియా సంస్థపై ప్రియాంక తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

చట్టపరమైన చర్యలు

చట్టపరమైన చర్యలు

తమ వివాహ బంధం గురించి ఇలాంటి అసత్య కథనం వెలువడడంతో ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ సదరు అమెరికన్ మీడియా సంస్థపై కేసు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారట. ఈ విషయంపై ప్రియాంక సన్నిహితులు, స్నేహితులు స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రియాంక స్నేహితులు మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితమే ప్రియాంక, నిక్ జోనస్ ని కలిశాం. వారిద్దరి అనెతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. తనపై వచ్చిన ఈ వార్తల పట్ల ప్రియాంక చాలా ఆగ్రహంతో ఉన్నట్లు తెలిపారు.

ప్రియాంక తలుచుకుంటే

ప్రియాంక తలుచుకుంటే

ప్రియాంక, నిక్ జోనస్ పై ఓ మీడియా సంస్థ అసత్య కథనాన్ని ప్రచురించింది. ఇది ఆమె కుటుంబంపై ప్రభావం చూపుతుంది. ప్రియాంక చోప్రా తలుచుకుంటే ఎలాంటి విషయాన్ని అయినా వదిలిపెట్టదు. ఆ మీడియా సంస్థ ప్రియాంక చోప్రా తీసుకొనబోయే చట్టపరమైన చర్యలని ఎదుర్కొనాల్సిందే అని ఆమె సన్నిహితులు కొందరు తెలిపారు. గతంలోకూడా ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ వివాహం గురించి అమెరికాకు చేసిన ఓ మహిళా జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రియాంక చోప్రా కేవలం డబ్బు, శృంగారం కోసమే నిక్ జోనస్ తో ప్రేమ నటిస్తోందని కామెంట్స్ చేసింది. ఆ తర్వాత ప్రియాంకకు క్షమాపణలు తెలిపింది.

పద్ధతి బాగాలేదంటూ

పద్ధతి బాగాలేదంటూ

ఇక విడాకులకు సంబంధించిన కథనంలో కూడా ప్రియాంకనే టార్గెట్ చేశారు. ప్రియాంక చోప్రా పరిణితిని చెందిన మహిళలా కాకుండా 21 ఏళ్ల యువతిలా ప్రవర్తిస్తోందని వార్తలు రాశారు. ప్రియాంక పద్ధతి నిక్ జోనస్ కుటుంబ సభ్యులకు నచ్చక పోవడంతో అతడిని విడాకులు తీసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నట్లు సదరు అమెరికన్ మీడియా సంస్థ పేర్కొంది. ప్రియాంక చట్టపరమైన చర్యలకు సిద్ధం అవుతున్న తరుణంలో క్షమాపణలు చెబుతారో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X