ప్రియాంక చోప్రా బ్యాచిలర్ పార్టీ, పొట్టి డ్రెస్సులో సూపర్ హాట్ (ఫోటోస్)

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా త్వరలో అమెరికన్ సింగర్, నటుడు నిక్ జొనాస్‌ను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే న్యూయార్క్‌లో బ్రైడల్ షవర్ పార్టీ జరింది. తాజాగా ప్రియాంక తన గర్ల్ గ్యాంగ్‌తో కలిసి బ్యాచిలర్ పార్టీ సెలబ్రేట్ చేసుకుంది.

అమెరికాలోని ఆమస్టర్‌డామ్‌లో గ్రాండ్‌గా ఈ బ్యాచిలర్ పార్టీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ పార్టీకి ప్రియాంక చోప్రా తెలుపు రంగు హాఫ్ షోల్డర్ స్వెటర్టో సూపర్ హాట్ లుక్‌తో దర్శనమిచ్చారు. పార్టీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ప్రియాంక లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా

ప్రియాంక లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా

బ్యాచిలర్ పార్టీకి ప్రియాంక సూపర్ హాట్ లుక్‌తో హాజరయ్యారు. ఈ పొట్టి డ్రెస్సులో ప్రియాంక మరింత అందంగా ఉంది అనే అభిప్రాయాలు అభిమానుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.

స్నేహితులతో కలిసి...

స్నేహితులతో కలిసి...


ప్రియాంక చోప్రా ఏర్పాటు చేసిన బ్యాచిలర్ పార్టీలో ఆమె స్నేహితులు శ్రిష్ఠి బెహెల్ ఆర్య, తమన్నా దత్, నటాషా పాల్, చంచల్ డిసౌజా, డనా సప్నిక్, గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ స్టార్ సోఫీ టర్నర్ పాల్గొన్నారు.

ప్రియాంక చోప్రా హ్యాపీ మూడ్

ప్రియాంక చోప్రా హ్యాపీ మూడ్

ప్రియాంక చోప్రా తన జీవితంలో ఎప్పుడూ లేనంత హ్యాపీ మ్యూడ్లో కనిపిస్తున్నారు. తను కోరుకున్నట్లు హాలీవుడ్లో సెటిలవ్వడం, మనసుపడ్డ నిక్ జోనాస్‌ను పెళ్లాడబోతుండటం.. ఇలా అన్నీ తను ప్లాన్ చేసుకున్నట్లే జరుగుతుండటంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

పార్టీ కాక్‌టెయిల్స్

పార్టీ కాక్‌టెయిల్స్

ప్రియాంక చోప్రా బ్యాచిలర్ పార్టీలో వివిధ రకాల కాక్‌టెయిల్ సర్వ్ చేశారు. ప్రియాంక స్నేహితురాలు శ్రిష్ఠి బెహెల్ ఆర్య ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలను బట్టి పార్టీ ఏ రేంజిలో సాగిందో ఊహించుకోవచ్చు.

పెళ్లి తర్వాత కాపురం ఇక్కడే

పెళ్లి తర్వాత కాపురం ఇక్కడే

పెళ్లి తర్వాత ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ పెళ్లి తర్వాత లాస్‌ఏంజెలెస్‌లోని బేవర్లీ హిల్స్‌ ప్రాంతంలో కాపురం పెట్టబోతున్నారు. ఇందుకోసం విలాసవంతమైన భవంతి కొనుగోలు చేశారు. దీని ఖరీదు 6.50 మిలియన్ డాలర్స్. మన కరెన్సీలో దాదాపు రూ. 48 కోట్లు.

ఇండియాలో వివాహం

ఇండియాలో వివాహం

ప్రియాంక, నిక్ జొనాస్ వివాహం ఇండియాలోనే జరుగబోతోంది. జోధ్‌పూర్‌లో జరిగే పెళ్లి వేడుక డేట్ ఎప్పుడు అనేది ఇంకా వెల్లడి కాలేదు. హాలీవుడ్ మూవీ ‘బేవాచ్'‌లో ప్రియాంక చోప్రాతో కలిసి నటించిన డ్వేన్ జాన్సన్(ది రాక్) ద్వారా నిక్ జొనాస్ ఆమెకు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ ఏడాది జులైలో లండన్ ట్రిప్‌లో ఉండగా ప్రియాంక 36వ పుట్టినరోజు సందర్భంగా నిక్ ఆమెకు ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X