రికార్డు సృష్టించిన ప్రియాంక చోప్రా.. తొలి ఇండియన్‌గా సంచలనం, వెనుకబడ్డ దీపిక!
ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్టార్ గా వెలుగొందుతోంది. క్వాంటికో సిరీస్ తో హాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ తో ప్రియాంక చోప్రా ప్రేమ వ్యవహారం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్. తాజగా ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో సంచలన రికార్డు సొంతం చేసుకుంది. ఇంస్టాగ్రామ్ లో 25 మిలియన్ల ఫాలోవర్స్ సొంతం చేసుకున్న తొలి ఇండియన్ గా ప్రియాంక చోప్రా అవతరించింది.
ఇంత వరకు ఈ రికార్డు ఏ ఇండియన్ కు సాధ్యం కాలేదు. జోరు మీదున్న దీపికా పదుకొనెని అధికమించి ప్రియాంక ఈ రికార్డు సొంతం చేసుకుంది. ప్రియాంక చోప్రా తరువాతి స్థానంలో దీపికా పదుకొనె 24.9 మిలియన్ ఫాలోవర్స్ తో కొనసాగుతోంది.

ఇంస్టాగ్రామ్ కాకుండా ట్విటర్ లో 23 మిలియన్ ఫాలోవర్స్, ఫేస్ బుక్ లో 37 మిలియన్ లైక్స్ ప్రియాంక చోప్రా సొంతం. ప్రియాంక చోప్ర సోషల్ మీడియా క్వీన్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు.


Click it and Unblock the Notifications











