»   » చంటిపిల్లలకు పాలిచ్చే డ్రెస్సా? వయసు మీద పడింది.. ప్రియాంకా చోప్రాపై ఫైర్

చంటిపిల్లలకు పాలిచ్చే డ్రెస్సా? వయసు మీద పడింది.. ప్రియాంకా చోప్రాపై ఫైర్

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Priyanka Chopra Dress Get Trolled By Tweeters

  హాలీవుడ్‌లో కేకపుట్టిస్తున్న అందాల తార ప్రియాంక చోప్రా కారణం లేకుండా కొన్నిసార్లు వివాదాలో కూరుకుపోతారు. తాజాగా సెక్సీ డ్రస్ వేసుకొన్న ప్రియాంకాకు సోషల్ మీడియాలో చుక్కెదురైంది. కొంతమంది నెటిజన్లు ఆమె గ్లామర్‌ను ప్రశంసించగా, మరికొందరు అలాంటి డ్రెస్‌ను వేసుకోవడంపై ఏకిపారేశారు. అంత సెన్సేషనల్‌గా మారిన ఆ డ్రెస్ ఎలా ఉందంటే..

  మోదీతో భేటీ సందర్బంగా

  మోదీతో భేటీ సందర్బంగా

  గతంలో లేట్ నైట్ విత్ సేథ్ మేయర్స్ కార్యక్రమంలో ధరించిన స్కర్ట్‌పై బ్లేజర్‌‌ మరోసారి హల్‌చల్ చేసింది. ఛాతీ భాగంలో కట్ చేసి ఉండటం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షించింది. హృదయభాగం స్పష్టంగా కనిపిస్తుండటంపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. గతంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా ధరించిన దుస్తులు కూడా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

  చంటిపిల్లలకు పాలిచ్చే డ్రస్

  సోషల్ మీడియాలోని ట్విట్టర్ అకౌంట్‌లో చాలా మంది నెటిజన్లు ఆ డ్రెస్‌పై స్పందించారు. చంటి పిల్లలకు పాలు ఇచ్చేందుకు సులభంగా ఉండే డ్రస్ అది. నాకు బాగా నచ్చింది. ఆడతనాన్ని చాటిచెప్పే విధంగా డ్రస్ వేసుకోవడం చాలా బాగుంది అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

  యువ హీరోయిన్లతో పోటీ పడటమే

  ప్రియాంక చోప్రా లాంటి సినీ తారకు వయసు మీద పడుతున్నది. అందుకే ఆమెలో అభద్రతాభావం తొంగి చూస్తున్నది. సినీ రంగంలో అలియా, దీపికా లాంటి యువ హీరోయిన్లు పోటీ ఇస్తుండటంతో ఇలాంటి డ్రస్‌లో వేసి శృంగారం ఒలకబోస్తున్నది. అందరిని ఆకట్టుకోవాలంటే మంచి దస్తులు వేసుకొంటే సరిపోతుంది అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

  డిజైనర్ సూపర్ ఫ్యాన్ అయితే

  డ్రస్ డిజైనర్ సూపర్ ఫ్యాన్ అయితే డ్రస్సులు ఇలానే ఉంటాయి. మాస్క్ లాంటి డిజైన్ మీ ఎదపై పెట్టారు. ఎలా ఉన్నా మీరు ఎప్పుడూ హాట్‌గా కనిపిస్తారు అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు. బ్యాట్‌మెన్ కళ్లతో ప్రియాంక చోప్రా అని మరోకరు పేర్కొన్నారు.

  ఎలా ఉండాలో ఆమె ఇష్టం

  ఎలా ఉండాలో ఆమె ఇష్టం

  ఎలా ఉండాలో, ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది ప్రియాంక చోప్రా ఇష్టం. తన ఫ్రీడమ్ ప్రకారం ఆమె నడుచుకొంటుంది. తన అకౌంట్‌లోకి వచ్చి అలాంటి కామెంట్లు చేయకూడదు. ఇలా వ్యాఖ్యలు చేయడకుండా జాగ్రత్తగా ఉండాలి అని ఒకరు కామెంట్ చేశారు.

  English summary
  Priyanka looked steaming hot dressed in a pastel blazer with cut-outs around her chest for an appearance on the ‘Late Night with Seth Meyers’, and even shared pictures on Instagram. Twitteratti and the Intagrammers slut-shaming her for revealing legs and cleavage, and some 'Indian culture-loving' ones even asking her to leave the country, another section took the opportunity to showcase their quirky and funny side.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more