అవి నాకు మాత్రమే సొంతం: నిక్ జొనాస్‌తో ఎంగేజ్మెంట్‌పై ప్రియాంక చోప్రా...
Recommended Video

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కొన్ని రోజులుగా అమెరికన్ సింగర్, నటుడు నిక్ జొనాస్‌తో ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. అతడిని ఇండియాకు తీసుకొచ్చి తన ఫ్యామిలీకి పరిచయం చేయడంతో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. సెప్టెంబర్ 16న నిక్ పుట్టినరోజు సందర్భంగా వీరి ఎంగేజ్మెంట్ జరుగుతుందనే రూమర్స్ సైతం ప్రచారంలోకి వచ్చాయి. తన ప్రేమ గురించి, అతడితో ఎఫైర్ గురించి ఎన్ని వార్తలు వచ్చినా ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ప్రియాంక ఎట్టకేలకు నోరు విప్పారు.

ప్రియాంకను చుట్టు ముట్టిన మీడియా
సోమవారం ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంటుకు హాజరైన ప్రియాంక చోప్రాను.... మీడియా చుట్టుముట్టింది. మీరు అమెరికన్ సింగర్ నిక్ జొనాస్‌ను పెళ్లాడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి నిజమేనా? మీ పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? అతడితో ఎన్నాళ్లుగా రిలేషన్ షిప్‌లో ఉన్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

నా జీవితం 90 శాతం తెరిచిన పుస్తకమే అన్న ప్రియాంక
‘నా మొత్తం జీవితంలో తొంభై శాతం తెరచిన పుస్తకమే. కానీ ఒక్క పది శాతం మాత్రమైనా ప్రైవసీగా ఉండాలని కోరుకుంటా. ముఖ్యంగా వ్యక్తిగత జీవితం గురించి ఓ సాధారణ అమ్మాయిలాగే ఆలోచిస్తా'... అని ప్రియాంక తెలిపారు.

ఆ విషయాలు నాకే సొంతం, ఎవరికీ చెప్పను
కొన్ని విషయాలు నాకు మాత్రమే సొంతం కావాలని ఆశించే హక్కు నాకు ఉంది కదా. అలాంటివి ఎవరికీ చెప్పాలని నేను అనుకోవడం లేదు' అంటూ నిక్ జొనాస్‌తో రిలేషన్ గురించి, అతడితో పెళ్లి గురించి దాట వేసే ప్రయత్నం చేసింది.

ఖండించలేదంటే నిజమన్నట్లే కదా...
అయితే నిక్ జొనాస్‌తో లవ్ ఎఫైర్ విషయం కానీ, అతడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలను కానీ ప్రియాంక ఖండించలేదు. దీంతో సెప్టెంబర్ 16న వీరి ఎంగేజ్మెంట్ జరుగడం ఖాయమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అందుకే ఆ మూవీ నుండి తప్పుకుంది
సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కే ‘భారత్' మూవీ నుండి ప్రియాంక అర్దాంతరంగా తప్పకుంది. ఆమె చాలా ప్రత్యేకమైన కారణంతోనే ఈ సినిమా నుండి తప్పకున్నట్లు ఫిల్మ్ మేకర్ అలీ అబ్బాస్ జఫర్ సైతం ప్రకటించారు. దీంతో నిక్‌తో పెళ్లికి సిద్ధమవుతున్న నేపథ్యంలోనే ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పకుందనే వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది.


Click it and Unblock the Notifications











