వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ... ప్రియాంక చోప్రా బ్రైడల్ షవర్ పార్టీ (ఫోటోస్)
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా మరికొన్ని రోజుల్లో అమెరికన్ సింగర్ నిక్ జొనాస్‌ను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్లో వీరి వివాహం ఇండియాలో జరుగనుంది. జోధ్‌పూర్ వేధికగా భారతీయ సాంప్రదాయంలో జరిగే వీరి పెళ్లి తేదీ ఎప్పుడు? అనేది వెల్లడి కాలేదు.
మరో వైపు.... అమెరికాలో ప్రియాంక-నిక్ వెడ్డింగ్ ముందస్తు సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. తాజాగా న్యూయార్కులో ఆదివారం బ్రైడల్ షవర్ పార్టీ నిర్వహించారు. అమెరికాలో పెళ్లి వేడుక ముందు జరుపుకునే వేడుక ఇది.

అందంగా మెరిసిపోయిన ప్రియాంక
ఈ వేడుకలో ప్రియాంక చోప్రా ప్రత్యేకంగా డిజైన్ చేసిన వైట్ స్టాప్‌లెస్ మర్చేసా డ్రెస్సులో అందంగా మెరిసిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

ఆ పార్టీ హోస్ట్ చేసింది ఎవరంటే..
ఈ పార్టీని ప్రియాంక క్లోజ్ ఫ్రెండ్స్ ముబీనా రాటోనే, అంజులా అచారియా హోస్ట్ చేశారు. ఈ వేడుకకు హాలీవుడ్ సెలబ్రిటీస్ కెల్లీ రిపా, లుపిత నైయోంగో, ప్రియాంకకు కాబోయే సిస్టర్ ఇన్ లా డేనియల్లే జోనాస్, ఆమె కూతురు అలీనా తదితరులు అతిథులుగా హాజరయ్యారు.

హ్యాపీగా మూడ్లో ప్రియాంక
ఈ వేడుకకు హాజరవుతూ ప్రియాంక చోప్రా న్యూయార్క్ వెన్యూ బయట మీడియాతో మాట్లాడుతూ.... ఈ పార్టీ విషయంలో చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు అభిమానులతో పంచుకున్నారు.

ఫ్యూచర్ మరింత అందంగా
భవిష్యత్తు మరింత అందంగా కనిపిస్తోందంటూ.... నిక్ జొనాస్ తనకు కాబోయే భార్య ప్రియాంకతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు. దీన్ని బట్టి నిక్ ఆమెను ఎంతలా ప్రేమించాడో అర్థం చేసుకోవచ్చు.
ప్రియాంక మేనల్లుడితో
ప్రియాంక చోప్రా మేనల్లుడితో కలిసి నిక్ జొనాస్.


Click it and Unblock the Notifications











