»   » రూ. 100 కోట్ల బంగళా కొన్న ప్రియాంక చోప్రా... గృహ ప్రవేశ వేడుకకు ప్రియుడితో!

రూ. 100 కోట్ల బంగళా కొన్న ప్రియాంక చోప్రా... గృహ ప్రవేశ వేడుకకు ప్రియుడితో!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Priyanka Chopra Buys 100 Crore Bungalow In Mumbai

  బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన ప్రియుడు, అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌తో కలిసి గురువారం రాత్రి ముంబైలో ల్యాండ్ అయ్యారు. అతడిని వెంటేసుకుని ముంబై రావడానికి ప్రత్యేక కారణం ఉందట. ప్రియాంక ముంబైలో కొత్తగా కొనుగోలు చేసుకుని భవంతి గృహ ప్రవేశ వేడుక కోసమే నిక్‌ను తీసుకుని వచ్చిందని, రూ. 100 కోట్లతో ప్రియాంక ఈ ఇంటిని కొనుగోలు చేసిందని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ముంబై నడి ఒడ్డున అరేబియా సముద్ర ముఖంగా ఈ బంగళా ఉన్నట్లు సమాచారం.

  ఈ వారమే గృహ ప్రవేశం

  ఈ వారమే గృహ ప్రవేశం

  ప్రియాంక కొనుగోలు చేసిన భవంతి గృహ ప్రవేశ కార్యక్రమం ఈ వారమే ఉంటుందని, నిక్‌ను తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిగా భావిస్తోంది కాబట్టే అతడిని ప్రత్యేకంగా వెంట పెట్టుకుని ముంబై వచ్చినట్లు మీడియా కోడై కూస్తోంది.

  ఈ ఇంట్లోనే సహజీవనం?

  ఈ ఇంట్లోనే సహజీవనం?

  గృహ ప్రవేశం తర్వాత కొన్ని రోజుల పాటు ప్రియాంక, నిక్ ఈ ఇంట్లోనే సహజీవనం చేస్తారనే పుకార్లు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. అతడిని తన వెంట తీసుకురావడం వెనక అసలు కారణం ఇదే అయుంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

  తిరిగి మళ్లీ యూఎస్ఏకు...

  తిరిగి మళ్లీ యూఎస్ఏకు...

  కొన్ని రోజులు ఇండియాలో గడిపిన తర్వాత ప్రియాంక, నిక్ తిరిగి యూఎస్ఏ వెళతారట. ఎందుకంటే ఇద్దరి కెరీర్ అమెరికాలోనే ఉంది. ప్రియాంక చోప్రా అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికోతో పాటు హాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. నిక్ జోనస్ సింగర్‌గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు.

  హాలీవుడ్లో భారీ సంపాదన

  హాలీవుడ్లో భారీ సంపాదన

  ప్రియాంక చోప్రా గత కొన్నేళ్లుగా అమెరికాలోనే ఎక్కువ గడుపుతోంది. హాలీవుడ్ సినిమాలు, అమెరికన్ టీవీ సిరీస్‌లో నటించడం ద్వారా ఆమె భారీగా సంపాదించింది. ఆ డబ్బుతోనే ముంబైలో రూ. 100 కోట్ల విలువ చేసే బంగళా కొన్నట్లు టాక్.

  లాంగ్ గ్యాప్ తర్వాత బాలీవుడ్ మూవీలో..

  లాంగ్ గ్యాప్ తర్వాత బాలీవుడ్ మూవీలో..

  ప్రియాంక చోప్రా లాంగ్ గ్యాప్ తర్వాత బాలీవుడ్ మూవీకి సైన్ చేసినట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కబోయే ‘భరత్' అనే మూవీలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం.

  English summary
  Priyanka Chopra and Nick Jonas landed in Mumbai last night and the paparazzi did everything possible to get a few good pictures of the couple, but the duo was in no mood to pose and hastily ran towards their car and the photographers ended up getting only a few pictures that too from their tainted window glass. We wonder why so much secrecy here? Also, Priyanka Chopra brought Nick Jonas to Mumbai as she wants him to be beside her during her house-warming ceremony.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more