ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్టుకు ఆ హీరోయిన్ ఎంత వసూలు చేస్తోందో తెలుసా?
సినీ సెలబ్రిటీలంతా ఇపుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలు తెరిచి భారీగా ఫాలోయింగ్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీరు ఇందులో అకౌంట్ ఓపెన్ చేయడం వెనక కేవలం అభిమానులను పెంచుకోవడం మాత్రమే కాదు.. సంపాదన కూడా భారీగా ఉంటోందట.
అత్యధిక మంది ఫాలోవర్సల్ కలిగిన టాప్ సెలబ్రిటీల ద్వారా కొన్ని కార్పొరెట్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రచారం చేయిస్తున్నాయి. తమ పొడక్ట్ గురించి వారు ఇన్‌స్టాలో ఒక్క పోస్టు పెడితే చాలు భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి.

ఈ విషయంలో అందరి కంటే ఎక్కువ వసూలు చేస్తూ ప్రియాంక చోప్రా టాప్ పొజిషన్లో ఉందట. ఆమె ఇన్‍స్టాలో ఒక్క పేయిడ్ పోస్ట్ కోసం రూ. 1.8 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రియాంకకు ఇన్‌స్టాలో 43 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లి రూ. 1.3 కోట్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తనకంటే వయసులో దాదాపు 10 ఏళ్లు చిన్నవాడైన నిక్‌ను ప్రియాంక చోప్రా గతేడాది డిసెంబర్లో పెళ్లాడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమెకు అమెరికన్ ఫ్యాన్స్ కూడా పెరిగిపోయారు. ఇటు బాలీవుడ్లో సినిమాలు చేస్తూనే హాలీవుడ్లో ఎదిగే ప్రయత్నం చేస్తోంది.


Click it and Unblock the Notifications











