ప్రియాంక చోప్రా, నిక్ నిశ్చితార్థం ఫిక్స్.. వచ్చే నెలలోనే..
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ అఫైర్ వార్తలు జోరందుకొన్నాయి. ప్రస్తుతం ఈ ప్రేమ పక్షులు గోవాలో విహారయాత్ర చేస్తున్నారు. ఇదిలా ఉండగా వీరిద్దరి వ్యవహారం మరో లెవెల్‌కు వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రియాంక, నిక్ నిశ్చితార్థం జూలై చివరి వారంలో గానీ, ఆగస్టులో గానీ జరుగవచ్చనేది తాజా సమాచారం. ఈ నేపథ్యంలోనే తన ఫ్యామిలీ సభ్యులకు పరిచయం చేసేందుకు నిక్‌ను ప్రియాంక ఇండియాకు తీసుకొచ్చినట్టు కథనాలు వెలువడుతున్నాయి.
గతంలో తన కజిన్ పెళ్లికి తీసుకెళ్లి ప్రియాంకను కూడా ఫ్యామిలీ మెంబర్స్‌కు నిక్ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అక్కడే జోనస్ ఫ్యామిలీ సభ్యులందరితో ప్రియాంక కలిసిపోయారు. ఆ తర్వాతనే తన తల్లి మధు చోప్రాను కలిపించేందుకు జూన్ 21వ తేదీన ముంబైకి వచ్చారు.

నిక్, ప్రియాంక చోప్రా తొలిసారి రాల్ప్ లారెన్ నేతృత్వంలో న్యూయార్క్‌లో జరిగిన ఓ గ్రాండ్ ఈవెంట్‌లో కలిశారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. అదే జోష్‌లో వారిద్దరూ ప్రస్తుతం పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











