చీర కట్టుకుంటే అలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది.. భర్తతో ప్రియాంక చోప్రా ఫుల్ రొమాన్స్
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తన భర్తతో కలిసి లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా వ్యాప్తి విస్తృతంగా ఉన్న సమయంలో ఆమె తన భర్త నిక్ జోనస్‌తో కలిసి అమెరికాలోని లాస్ ఎంజెలెస్‌లోని తన నివాసంలో స్వీయ గృహ నిర్బంధాన్ని పాటిస్తున్నారు. అయితే లాక్‌డౌన్‌లో మాత్రం తన సొగసులకు అందాలు దిద్దడం మానుకోలేదు. తాజాగా చీరకట్టులో భర్తనే కాదు.. అభిమానులకు కూడా తన అందంతో మత్తెక్కించారు.
తన చీరకట్టు గురించి ప్రియాంక చోప్రా ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ పొస్టు పెట్టింది. నేను చీరకట్టు కట్టుకొన్నప్పుడల్లా ఇండియాలోని నా సొంత ఇంటిలో ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. ఈ సమయంలో చాలా మందిని మిస్ అవుతున్నాను అని ఓ ఫోటోను షేర్ చేసింది.

ఇదిలా ఉండగా, కరోనాపై పోరాటం చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు ఇటీవల ప్రియాంక చోప్రా అండగా నిలిచారు. ప్రపంచాన్ని కరోనా కుదిపేస్తున్న సమయంలో ప్రియాంక, నిక్ జోనస్ పలు రకాలుగా విరాళాలు ప్రకటించారు. యూనిసెఫ్, పీఎం కేర్స్, గూంజ్, ఫీడింగ్ అమెరికా లాంటి సంస్థలకు ప్రియాంక దంపతులు భారీగా విరాళాలు అందించారు. అంతేకాకుండా భారత దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల జతల పాదరక్షలను ఆందించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, హర్యానా, కర్ణాటకలోని హెల్త్ ఉద్యోగులకు వీటిని అందుబాటులోకి తెచ్చారు. కరోనావైరస్ వ్యాప్తి నిరోధానికి పోరాటం చేస్తున్న హెల్త్ ఉద్యోగులే నిజమైన పోరాట యోధులు. వారి ప్రాణాలను లెక్క చేయకుండా వారు రాత్రి, పగళ్లు అనే తేడా లేకుండా సేవలందించడం గొప్ప విషయం అని ప్రియాంక అన్నారు. ఇలాంటి సహాయాలే కాకుండా భారత ప్రధాని మోదీ సహాయ నిధికి, మహారాష్ట్ర సీఎం నిధికి ఆమె విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











