తన పెళ్లిపై ప్రియాంక ఘాటు వ్యాఖ్యలు.. ఒకవేళ అబ్బాయి నాకంటే పెద్దవాడైతేనా!

సోషల్ మీడియా బాగా విస్తరించడంతో సెలెబ్రిటీలు, సాధారణ ప్రజల మధ్య దూరం చాలా వరకు తగ్గిపోయింది. సెలెబ్రెటీలకు తెలిసేలా నేరుగా సందేశం పెట్టే అవకాశం ఉండటంతో వారి పర్సనల్ లైఫ్ లోకి ఎంటరై కూడా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది మరీ ఎక్కువ. అసలు హీరోయిన్‌కి స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కే లేదన్నట్లుగా ఆమెకు సంబంధించి ఏ చిన్న విషయం నచ్చక పోయినా ట్రోల్ చేస్తుంటారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు కూడా ఇవి తప్పలేదు. దీంతో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తనను విమర్శిస్తున్న వారిని ఏకిపారేసింది ప్రియాంక.

తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ని ప్రేమించి పెళ్లాడింది ప్రియాంక. దీంతో ఈమె పెళ్లిపై సోషల్ మీడియాలో దుమారం రేపారు నెటిజన్స్. ఓ బడా స్టార్ అయి ఉంది ఇలా పదేళ్లు చిన్నవాడిని పెళ్లి చేసుకోవడానికి సిగ్గుగా లేదా? అంటూ తెగ విమర్శలు గుప్పించారు. అయినా అవేవీ పట్టించుకోలేదు ప్రియాంక. కానీ తమ పెళ్ళై ఇన్ని రోజులైనా ఆ విమర్శలకు ఫుల్‌స్టాప్ పడకపోవడంతో ప్రియాంక చోప్రా కాస్త గట్టిగానే క్లాస్ పీకింది.

Priyanka Chopra fire on neitizen trolling

తాజాగా ఓ అమెరికన్‌ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ''చాలా మంది మా గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. పెళ్ళై ఇన్ని రోజులైనా ఇప్పటికీ వాగుతూనే ఉన్నారు. నా కంటే చిన్నవాడిని పెళ్లి చేసుకున్నానని అందరూ నానా రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఒకవేళ నాకంటే అబ్బాయి వయసులో పెద్దవాడు అయుంటే మాత్రం ఎవ్వరూ ఏమీ అనేవారు కాదేమో. ఒకవేళ నేను అలా పేదవాడిని పెళ్లి చేసుకుని ఉంటే కామెంట్లు చేసేవారికి నచ్చేది కావచ్చు. అయినా మీ మీ వ్యవహారాలు పక్కన బెట్టి మా గురించి మీకెందుకు?'' అంటూ ఘాటుగా రియాక్ట్ అయింది.

పెళ్లి తర్వాత భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయినా ప్రియాంక ప్రస్తుతం 'ది స్కై ఈజ్‌ పింక్' అనే బాలీవుడ్‌ చిత్రంలో నటిస్తోంది. షొనాలీ బోస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఫర్హాన్‌ అక్తర్‌, జైరా వాసిం, రోహిత్‌ సరఫ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో పాటు పలు హాలీవుడ్ సినిమాలు సైతం చేస్తోంది ప్రియాంక.

More from Filmibeat

Read more about: priyanka chopra nick jonas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X