పెళ్లికి నాలుగు రోజుల ముందే... ప్రియాంకను సెట్లో అలా చూసి ఏడ్చేసిన భర్త!

ప్రియాంక చోప్రా త్వరలో 'ది స్కై ఈజ్ పింక్' అనే బాలీవుడ్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వా ఆమె హిందీలో చేస్తున్న మూవీ ఇది. షోనాలి బోస్ దర్శకత్వం వహించగా... రోనీ స్క్రూవాలా, సిద్ధార్థ్ రాయ్ కపూర్, ప్రియాంక చోప్రా సంయుక్తంగా నిర్మించారు.

ఈ సినిమా గురించి ప్రియాంక చోప్రా మీడియాతో మాట్లాడుతూ... 'స్కై ఈజ్ పింక్' ఫైనల్ సీన్ చూసిన తర్వాత తన భర్త, అమెరికన్ సింగర్ నిక్ జోనస్ కంటతడి పెట్టినట్లు తెలిపారు. గత డిసెంబర్లో నిక్‌తో తన వివాహం జరుగడానికి నాలుగు రోజుల ముందే షూటింగ్ పూర్తయిందని, ఫైనల్ సీన్ చిత్రీకరణ చూసేందుకు ఆ సమయంలో నిక్ సెట్స్‌కు వచ్చినట్లు వెల్లడించారు.

షూటింగుకు హాజరైన నిక్ జోనస్

షూటింగుకు హాజరైన నిక్ జోనస్

మోటివేషనల్ స్పీకర్ ఆయేషా చౌదరి తల్లిదండ్రుల ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. "నా పెళ్లికి నాలుగు రోజుల ముందు ది స్కై ఈజ్ పింక్ చిత్రీకరిణ జరిగింది. అపుడు నిక్ సెట్‌లోనే ఉన్నాడు. ఆ సమయంలో మేము అక్కడే పెళ్లికి సంబంధించిన ప్రిపరేషన్స్ కూడా కొన్ని చేసుకున్నాం. నా సహ-నిర్మాతలు, షోనాలి మాకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు' అని టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (టిఐఎఫ్ఎఫ్)లో ఇడబ్ల్యు అండ్ పీపుల్స్ స్టూడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక చెప్పుకొచ్చారు.

అతడి కళ్లలో నీళ్లు వచ్చాయి

అతడి కళ్లలో నీళ్లు వచ్చాయి

షోనాలి బోస్ అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ... "వారి వివాహానికి ముందు మేము చిత్రీకరిస్తున్న చివరి సన్నివేశం చూసి నిక్ ఉద్వేగానికి గుయ్యాడు. షూటింగ్ ఎండ్ అయ్యే సమయానికి మేము నిక్‌ను రమ్మని చెప్పాం. కాని అతను కొంచెం ముందుగానే వచ్చాడు. అక్కడ చిత్రీకరించిన ఒక ఇంటెన్స్ సీన్ చూసి నిక్ కళ్లలో నీళ్లు వచ్చాయి'' అని తెలిపారు.

ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా

ప్రియాంక ప్రస్తుతం ‘ది స్కై ఈజ్ పింక్' బృందంతో కలిసి, ప్రస్తుతం టిఎఫ్ఎఫ్‌కు హాజరవుతోంది, ఇక్కడ ఈ చిత్రం వరల్డ్ ప్రీమియర్‌షో ఉంది. ఈ మూవీలో ఇంకా ఫర్హాన్ అక్తర్, జైరా వసీం, రోహిత్ సరఫ్ తదితరులు నటిస్తున్నారు.

ది స్కై ఈజ్ పింక్

ది స్కై ఈజ్ పింక్

‘ది స్కై ఈజ్ పింక్' కథ జూహి చతుర్వేది రాశారు. 2016లో ప్రియాంక హాలీవుడ్ వెళ్లిన తర్వాత చేస్తున్న మొదటి హిందీ ప్రాజెక్ట్ ఇది. ఇందులో ఆమె కూడా నిర్మాతగా ఉండటం మరో విశేషం. అక్టోబర్ 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X