నీ భార్యకు ఆ వ్యాధి.. అయినా అలా చేస్తావా? ప్రియాంక చోప్రా భర్తకు నెటిజన్ల షాక్
అందాల తార ప్రియాంక చోప్రా దంపతులు కలిసి సిగరెట్ తాగుతున్న ఫోటోలు మీడియాలో చాలానే వెలుగు చూశాయి. ప్రధానంగా ప్రియాంక భర్త నిక్ జోనస్‌కు సిగరెట్ తాగే అలవాటు ఎక్కువగానే ఉంది. తాజాగా ప్రియాంకను పక్కనే పెట్టుకొని సిగరెట్ తాగుతున్న రెండు ఫోటోలను ఇటీవల ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఆ ఫోటోలు చూసి నిక్‌పై నెటిజన్లు మండిపడ్డారు.
మాకు ప్రియాంక దంపతులు ఇష్టమే. నిక్‌పై మాకు కోపం లేదు. కానీ సిగరెట్ తాగడం మాకు నచ్చదు. ధూమపానం ఆరోగ్యానికి మంచిది కాదు. సిగరెట్ తాగవొద్దని చెప్పడం మా బాధ్యత కాదు. సిగరెట్ తాగితే నీకు వచ్చే డయాబెటీస్, క్యాన్సర్ వ్యాధి గురించే మాకు బెంగ అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.

ఇక మీరు మీ భార్య ప్రియాంక చోప్రా ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవాలి. ఆమె ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆమె చుట్టుపక్కల ఉన్నప్పుడు ధూమపానం మానుకోవాలి అని నెటిజన్లు సూచించారు. ఇలా అస్తమా బారిన పడిన భార్య ఆరోగ్యం గురించి ఆలోచించాలన్నారు.
గతంలో తన పుట్టిన రోజు సందర్బంగా ప్రియాంక సిగరెట్ తాగడంపై కూడా దారుణంగా కామెంట్లు చేశారు. ఆస్తమా వ్యాధి ఉండి కూడా సిగరెట్ తాగుతావా అంటూ నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











