నీచంగా మాట్లాడింది: ప్రియాంక చోప్రా వీడియోపై భారత అభిమానుల ఆగ్రహం!
Recommended Video

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత ఇండియన్ సినిమాలు చేయడం తగ్గించేసింది. అమ్మడి తీరు చూస్తుంటే అమెరికాలోనే సెటిలయ్యేలా కనిపిస్తోంది. పోతే పోయింది కానీ... ఇండియాకు సంబంధించిన అంశాల్లో ప్రియాంక ప్రవర్తన భారత అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తోంది. ఆమె నటిస్తున్న 'క్వాంటికో' టీవీ సిరీస్‌లోని ఓ సీన్లో ఇండియన్స్‌ను టెర్రరిస్టులుగా చూపించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రియాంకకు చెందిన ఓ పాత వీడియో టేపు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రియాంక వివాదాస్పద కామెంట్స్
ప్రియాంక చోప్రాకు సంబంధించిన పాత వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయంది. ఎమ్మీ అవార్డ్స్ 2016లో పాల్గొన్న సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ అభిమానులను ఆగ్రహానికి కారణమైంది. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ... ఇండియన్ సినిమా అంటే ‘హిప్స్ అండ్ బూబ్స్' అంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు.

ఇంత నీచంగా మాట్లాడతావా? అంటూ ఫైర్...
ఇండియాలో పుట్టి పెరిగి, ఇండియన్ సినిమాల్లో నటించడం ద్వారా ఈ స్థాయికి వచ్చిన ఆమె.... చివరకు ఇక్కడి సినీ పరిశ్రమను అవమానిస్తూ నీచంగా మాట్లాడటం చాలా దారుణమని పలువురు భారతీయులు మండి పడుతున్నారు.

క్వాంటికో వివాదం
ప్రియాంక చోప్రా చేస్తున్న ‘క్వాంటికో' సిరీస్‌లోని ఓ ఎపిసోడ్లో ఇండియన్స్‌ను టెర్రరిస్టులుగా చూపిస్తూ కొన్ని సీన్లు చిత్రీకరించారు. సొంత దేశాన్ని అవమానిస్తూ ఇలాంటి సీన్లు చేయడానికి సిగ్గుగా లేదా? అంటూ ఇండియన్ ఫ్యాన్స్ మండి పడ్డారు. ఇలాంటి సీన్లు చూపించడం ద్వారా భారతీయులపై అమెరికాలో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

క్షమాపణలు చెప్పిన ప్రియాంక
‘క్వాంటికో' సీన్ వివాదంపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రియాంక చోప్రా స్పందించారు. ఇందులోని సీన్లు ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ‘క్వాంటికో'లో చూపించేదంతా కల్పితం మాత్రమే అని, ఎవరినీ బాధ పెట్టాలనే ఉద్దేశ్యంతో తీసింది కాదన్నారు.


Click it and Unblock the Notifications











