twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియాంక చోప్రాకు పాక్ సెగ.. ఆమెను తొలగించండి అంటూ..

    |

    పాకిస్థాన్ మద్దతు దారులపై మండిపడ్డ అందాల తార ప్రియాంక చోప్రాకు సెగ తలిగింది. పాకిస్థాన్‌కు చెందిన మానవ హక్కుల మంత్రి షిరీన్ మజారీ, నటుడు అర్మీనా ఖాన్ మండి పడుతున్నారు. ప్రియాంకను యూఎన్ గుడ్‌విల్ అంబాసిడర్ పదవి నుంచి తొలగించాలని యూనిసెఫ్‌ను కోరడం సినీ, రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ మేరకు ఓ ట్వీట్ కూడా చేశారు.

    ప్రియాంక చోప్రాను ఉన్నత పదవి నుంచి వెంటనే తప్పించాలని యూనిసెఫ్‌ను కోరుతున్నాం. మోదీ ప్రభుత్వానికి, భారతీయ సైన్యానికి మద్దతు తెలిపిన ప్రియాంక చోప్రాపై వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇలాంటి నియమాకాలు అప్రతిష్ట పాలువుతాయి. ఇలాంటి ఉన్నత పదవుల్లో ఎవర్ని నియమించాలి అనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి అని మజారీ ట్వీట్ చేశారు. పుల్వామాలో వార్‌ను సమర్థించినందుకు యూఎన్ తగిన చర్యలు తీసుకోవాలని అర్మీనా ఖాన్ డిమాండ్ చేసింది.

    Priyanka Chopra Jonas gets shock from Pakistan actors

    ఇటీవల ఓ మీడియా సమావేశంలో ప్రియాంక చోప్రాకు పాకిస్థానీ యువతి నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. యుద్ధాన్ని ప్రోత్సహించేలా కామెంట్ చేయడం తప్పు కాదా అనే ప్రశ్నను యువతి సంధించారు. రాయబారి పదవిలో కొనసాగుతూ పాక్‌పై న్యూక్లియర్ వార్ చేయాలని వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ యువతి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రియాంక చోప్రా సినిమాలను పాక్‌లో విశేషంగా ఆదరిస్తారు. అలాంటి నేపథ్యంలో పాక్‌పై యుద్ధానికి ప్రేరేపించడం దారుణమని అన్నారు.

    పాక్ నటీనటుల ఆగ్రహానికి కారణం ప్రియాంక చేసిన ట్వీట్. జైహింద్. పుల్వామా దాడి తర్వాత పాకిస్థానీ టెర్రర్ క్యాంపులపై సర్జికల్ దాడులు చేసిన భారత ఆర్మీకి అభినందనలు అంటూ ప్రియాంక ట్వీట్ చేసింది. ప్రియాంక కుటుంబం సైన్యంతో ముడిపడి ఉంది. ప్రియాంక తండ్రి సైన్యంలో డాక్టర్‌గా సేవలందించారు.

    English summary
    After being slammed by pro-Pakistani supporters for allegedly cheering for war, Pakistan's Human Rights Minister Shireen Mazari and Pakistani actor Armeena Khan have urged UNICEF to remove Bollywood actress Priyanka Chopra Jonas as the UN Goodwill Ambassador.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X