రూ.144కోట్ల ఖరీదైన ఇళ్లు.. ఇక మిగిలింది పిల్లల్ని కనడమే.. ప్రియాంక చోప్రా కామెంట్స్
ప్రపంచ స్థాయి హీరోయిన్ అయిన ప్రియాంక చోప్రా ఏది చేసినా సంచలనంగానే మారుతోంది. హాలీవుడ్ రాక్ స్టార్ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకోవడంతో అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయింది. హాలీవుడ్ చిత్రాల్లో నటించి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిపోయింది. ప్రియానిక్ జంట గురించి నిత్యం ఏదో ఒక వార్త హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. తాజాగా వీరి విలాసవంతమైన నూతన గృహానికి సంబంధించిన వార్త ట్రెండీగా మారింది.

దాదాపు 144కోట్ల వ్యయం..
అత్యాధునిక హంగులతో నిర్మించబడ్డ ఈ ఇంటి ని ఏకంగా 20 మిలియన్ డాలర్ల ను అంటే దాదాపుగా 144 కోట్ల రూపాయలను వెచ్చించి కొనుగోలు చేశారని సమాచారం. ఆ ఏరియాల్లో ఇదే అతి పెద్ద కొనుగోలు ఒప్పందం అంటూ అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒక ఫిల్మ్ స్టార్ మరియు రాక్ స్టార్ కలిసి ఇంత భారీ మొత్తంలో పెట్టి ఇల్లు తీసుకోవడంతో అక్కడి వారు ఆశ్చర్య పోతున్నారని టాక్.

అత్యంత విశాలమైన ఇళ్లు..
ఇక ఇల్లు విషయానికి వస్తే ఇంట్లో మొత్తం 7 విశాలమైన బెడ్ రూంలు ఉన్నాయట. 11 బాత్ రూంలతో పాటు సువిశాలమైన లీవింగ్ రూం... హాల్.. బాల్కనీ మరియు ల్యాన్‌లు ఉన్నాయట. జిమ్ మరియు స్విమ్మింగ్ పూల్‌లతో పాటు ఇంకా ఎన్నో రకాల ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లు ఆ ఇంట్లో పీసీ అండ్ నిక్ లు ఏర్పాటు చేయించుకుంటున్నారట. నిక్ 144 కోట్ల తో ఇల్లు కొనుగోలు చేయగా నిక్ సోదరుడు జో జోనస్ కూడా 101 కోట్ల రూపాయలు పెట్టి నిక్ ఇంటికి కాస్త దూరం లో ఒక విలాస వంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు గా సమాచారం అందుతోంది.

పదేళ్లలో పిల్లల్ని..
ఇల్లు కొనుగోలు చేసిన విషయ మై ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. కొత్త ఇల్లు , నాకంటూ పిల్లలు అనేది నా కోరిక. ఇల్లు అనేది ఉంది.. ఇక నా పిల్లలు అంటూ ఉండాలని ఆశిస్తున్నాను. రాబోయే పదేళ్లలో పిల్లలను కంటానంటూ చెప్పుకొచ్చింది. తనకు పిల్లలంటే చాలా ఇష్టమని, పదేళ్లు లేదా అంతకంటే ముందుగానే పిల్లల్ని కంటానేమోనని చెప్పుకొచ్చింది.

స్కై ఈజ్ పింక్‌తో హిట్..
నిక్ జోనాస్‌తో వివాహానంతరం.. బాలీవుడ్ చిత్రాలను తగ్గించిన ప్రియాంక రీసెంట్‌గా స్కై ఈజ్ పింక్‌తో మంచి విజయాన్ని అందుకుంది. అయినా ఇక్కడి చిత్రాలకు మాత్రం అంత ఈజీగా ఓకే చెప్పడం లేదు. ప్రస్తుతం ప్రియాంక చేతిలో ఓ హాలీవుడ్ చిత్రం, ఓ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











