ప్రియాంక చోప్రా ఎంగేజ్మెంట్ పార్టీ: సందడి చేసిన ప్రముఖులు (ఫోటోస్)
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కొంతకాలంగా అమెరికన్ సింగర్, నటుడు నిక్ జొనాస్‌తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరికి ఇప్పటికే ఎంగేజ్మెంట్ జరిగినట్ల కొంతకాలంగా ప్రచారం జరిగింది. తమకు ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని ప్రియాంక శనివారం అఫీషియల్‌గా ప్రకటించింది. నిక్ ఫ్యామిలీ కూడా భారత్ చేరుకుంది. పెళ్లికి ముందు జరుగాల్సిన కొన్ని సాంప్రదాయ బద్దమైన కార్యక్రమాలు, పూజలు నిర్వహిచారు. అనంతరం ఏర్పాటు చేసిన పార్టీకి బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

రోకా సెర్మనీ
ప్రియాంక చోప్రా కుటుంబ సాంప్రదాయం ప్రకారం త్వరలో పెళ్లి చేసుకోబోతున్న కొత్త జంట రోకా సెర్మనీలో పాల్గొన్నారు.

ఆసక్తిగా వీక్షించిన నిక్ కుటుంబం
రోకా కార్యక్రమాన్ని నిక్ కుటుంబ సభ్యులు ఆసక్తిగా వీక్షించారు. హిందూ సాంప్రదాయ పద్దతులను, పెళ్లి ముందు ఏయే కార్యక్రమాలు జరుపుతారు అనేవి అడిగి తెలుసుకున్నారట.

గ్రాండ్ పార్టీ
పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోట్‌లో పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులతో పాటు ముఖేష్ అంబానీ లాంటి బడా వ్యాపారులు కూడా హాజరయ్యారు.

ప్రియాంక-నిక్ ఫ్యామిలీ
తన తల్లి, సోదరుడుతో కలిసి ప్రియాంక, తల్లిదండ్రులతో కలిసి నిక్ జొనాస్ ఫ్యామిలీ ఫోటో.

అంబానీ ఫ్యామిలీ
ప్రియాంక చోప్రా-నిక్ జొనాస్ ఎంగేజ్మెంట్ పార్టీలో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ.

సంజయ్ లీలా
ప్రియాంక చోప్రా-నిక్ జొనాస్ ఎంగేజ్మెంట్ పార్టీకి హాజరైన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ.

పరిణీతి చోప్రా
ప్రియాంక చోప్రా-నిక్ జొనాస్ ఎంగేజ్మెంట్ పార్టీలో హీరోయిన్ పరిణీతి చోప్రా.

సిద్దార్థ్ రాయ్ కపూర్
ప్రియాంక చోప్రా-నిక్ జొనాస్ ఎంగేజ్మెంట్ పార్టీ బాలీవుడ్ నిర్మాత సిద్దార్థ్ రాయ్ కపూర్.

అర్పిత ఖాన్
ప్రియాంక చోప్రా-నిక్ జొనాస్ ఎంగేజ్మెంట్ పార్టీలో సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్.

అలియా భట్
ప్రియాంక చోప్రా-నిక్ జొనాస్ ఎంగేజ్మెంట్ పార్టీలో అలియా భట్.


Click it and Unblock the Notifications











