twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇక ప్రియాంక చోప్రా శ్రీమతి.. గుర్రంపైన వచ్చి ఎగురేసుకెళ్లిన ప్రియుడు.. పదేళ్ల చిన్నోడితో!

    |

    Recommended Video

    Priyanka Chopra-Nick Jonas Wedding : Priyanka-Nick Tied The Knot In Jodhpur’s Umaid Bhawan Palace

    బాలీవుడ్ అందాల నటి ప్రియాంక చోప్రా, అమెరికా సింగర్ నిక్ జోనాస్ దంపతులయ్యారు. శనివారం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఉమేద్ భవన్‌ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రియాంక చోప్రాను నిక్ జోనాస్ వివాహమాడారు. వీరి వివాహం క్రిస్టియన్ పెళ్లి సంప్రదాయంలో జరిగిదింది. ఈ పెళ్లి వేడుక సన్నిహితులు, స్నేహితులు, బాలీవుడ్ సినీ ప్రముఖులు మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. వివరాల్లోకి వెళితే

    గుర్రంపైన వచ్చిన నిక్

    గుర్రంపైన వచ్చిన నిక్

    ప్రియాంక, నిక్ పెళ్లి కోసం ఇరు వర్గాల బంధువులు గురువారమే జోధ్‌పూర్‌కు చేరుకొన్న సంగతి తెలిసిందే. శనివారం జరిగిన పెళ్లిలో రాయల్ లుక్‌ సూట్‌లో నిక్ పెళ్లికొడుకుగా అందర్నీ ఆకర్షించాడు. పెళ్లిలో భాగంగా నిక్ జోనాస్ గుర్రంపై వేదిక వద్దకు రావడం ఆకట్టుకొన్నది. ఈ పెళ్లిలో మరో రెండు వేడుకలు జరుగనున్నాయి.

    క్రిస్టియన్ వివాహ పద్దతిలో

    క్రిస్టియన్ వివాహ పద్దతిలో

    ప్రియాంక పెళ్లిలో భాగంగా ఆదివారం హిందూ సంప్రదాయం ప్రకారం వివాహాన్ని జరిపించనున్నారు. ఈ వేడుక కోసం సర్వం సిద్దమైంది. ప్రియాంక తరఫు స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు భారీగా తరలివచ్చారు.

    నిక్ జోనాస్ బంధువులు భారీగా

    నిక్ జోనాస్ బంధువులు భారీగా

    నిక్ జోనాస్, ప్రియాంక పెళ్లి కోసం అమెరికా నుంచి పెళ్లి కొడుకు వర్గం భారీగానే హాజరయ్యారు. నిక్ తండ్రి పాల్ కెవిన్ జోనాస్ అన్ని ఏర్పాట్లు చూసుకొన్నట్టు మీడియా కథనాన్ని వెల్లడించింది. నిక్ జోనాస్ పాప్ రాక్ బ్యాండ్ గ్రూప్ ది జోనాస్ బ్రదర్స్ సభ్యులు కూడా పెళ్లికి హాజరయ్యారు.

    ఏడాది క్రితం ప్రేమ చిగురించి

    ఏడాది క్రితం ప్రేమ చిగురించి

    ఏడాది క్రితం వ్యానిటీ ఫెయిర్ ఆస్కార్ పార్టీలో నిక్, ప్రియాంక చోప్రా కలుసుకొన్నారు. ఆ తర్వాత ఒకరిపై మరొకరు రొమాంటిక్‌గా ప్రేమ సందేశాలను పంపుకొన్నారు. చిన్న చిన్న సరదాలతో రొమాంటిక్ లైఫ్‌ను పంచుకోవడమే కాకుండా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. చివరికి రెండు నెలల క్రితం వారిద్దరికి ఎంగేజ్‌మెంట్ జరిగింది. ప్రియాంక కంటే పదేళ్లు నిక్ చిన్నవాడన్న సంగతి తెలిసిందే.

    డిసెంబర్ 4న రిసెప్షన్

    డిసెంబర్ 4న రిసెప్షన్

    పెళ్లి తర్వాత ప్రియాంక, నిక్ భారీ విందును ఏర్పాటు చేయబోతున్నారు. సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖుల కోసం ఢిల్లీ, ముంబైలో రెండు విలాసవంతమైన రిసెప్షన్లు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 4న ముంబై తాజ్‌లో విందును ఏర్పాటు చేశారు. సంజయ్ లీలా భన్సాలీ, రణ్‌బీర్ కపూర్, అలియాభట్, షారుక్, బిగ్‌బీ ఫ్యామిలీలను ఆహ్వానించినట్టు సమాచారం.

    English summary
    Actor Priyanka Chopra and American singer Nick Jonas have tied the knot in Jodhpur’s Umaid Bhawan Palace. The couple exchanged vows are per the Christian wedding ceremony that was officiated by Nick’s father, Paul Kevin Jonas, Sr, according to a report in People.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X