హనీమూన్ మూడ్లో ప్రియాంక చోప్రా-నిక్ జొనాస్... ఎక్కడో తెలుసా?
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అమెరికన్ నటుడు, సింగర్ నిక్ జొనాస్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. గత 15 రోజులుగా జరుగుతున్న వీరి పెళ్లి సెలబ్రేషన్స్ చివరి దశకు చేరుకున్నాయి. వివాహ వేడుక పూర్తయిన వెంటనే ప్రియాంక చోప్రా మళ్లీ తన పనిలో బిజీ కానున్నారు. అయితే ఈ గ్యాపులో తన భర్త నిక్‌తో కలిసి హనీమూన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
గడిచిన వీకెండ్ ఇషా అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న ప్రియాంక చోప్రా-నిక్ దంపతులు అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే హనీమూన్ బయల్దేరి వెళ్లారు. ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇందుకు సంబంధించి అభిమానులకు కొన్ని హింట్స్ ఇవ్వడం గమనార్హం.

హనీమూన్ ఎక్కడో తెలుసా?
బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.... ప్రియాంక, నిక్ తమ ఫస్ట్ హనీమూన్‌ను ఒమన్ దేశంలో సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోస్ ప్రియాంక షేర్ చేశారు.

వైభవంగా పెళ్లి వేడుక
డిసెంబర్ 1, 2 తేదీల్లో క్రిస్టియన్, హిందూ సాంప్రదాయాల ప్రియాంక, నిక్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం ఐదు రోజుల పాటు ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్లో రాయల్ వెడ్డింగ్ స్టైల్‌లో వీరి వివాహం జరిగింది.

అంతలోనే ప్రేమ, పెళ్లి
ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ తొలిసారిగా 2017లో జరిగిన ఆస్కార్ పార్టీలో కలిశారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. అదే ఏడాది తొలిసారి ఇద్దరూ కలిసి ఫస్ట్ పబ్లిక్ అప్పియరెన్స్ ఇవ్వడం ద్వారా తమ ప్రేమ విషయం అందరికీ తెలిసేలా చేశారు.

పెళ్లికి ముందు నుంచే డేటింగ్
పెళ్లికి కొన్ని నెలల ముందు నుంచే ఇద్దరూ డేటింగులో ఉన్నారు. ఇద్దరి మనస్తత్వాలు కలవడం, వైవాహిక జీవితం ప్రారంభించడానికి అంతా అనుకూలంగా ఉండటంతో డిసెంబర్ 1, 2 తేదీల్లో వివాహ వేడుక ద్వారా ఏకమయ్యారు. వీరి ప్రేమకు అటు అమెరికన్ ఫ్యాన్స్, ఇటు ఇండియన్ అభిమానుల నుంచి మద్దతు లభించింది.

మరో వెడ్డింగ్ రిసెప్షన్
ప్రియాంక, నిక్ దంపతులు ఇప్పటికే డిసెంబర్ 4న ఢిల్లీలో వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ప్రధాని మోడీ కూడా హాజరయ్యారు. డిసెంబర్ 20న బాలీవుడ్ ప్రముఖుల కోసం మరో వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించబోతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











