twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియాంక-నిక్ వెడ్డింగ్: ఖర్చు ఎంతో తెలిస్తే షాకే, పూర్తి వివరాలు...

    |

    బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా త్వరలో అమెరికన్ సింగర్, నటుడు నిక్ జొనాస్‌ను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 2, 3 తేదీల్లో జోధ్‌పూర్‌లోని తాజ్ ఉమైద్ భవన్‌ ప్యాలెస్‌లో రెండు సాంప్రదాయాల్లో వీరి పెళ్లి వేడుక జరుగబోతోంది. నవంబర్ 29 నుండే ఇక్కడ పెళ్లి సందడి మొదలు కాబోతోంది.

    తాజ్ హోటల్స్ నిర్వహణలో ఉన్న ఉమైద్ భవన్‌ను నవంబర్ 29 నుంచి డిసెంబర్ 3 వరకు బుక్ చేశారట. పెళ్లికి ముందు జరిగే వేడుకలైన మెహందీ, సంగీత్ కార్యక్రమాలు మెహ్రంగర్ కోటలో జరుగుతాయట. ఇందుకోసం ప్రియాంక, నిక్ పెట్టే ఖర్చు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అందుకు సంబంధించిన వివరాలపై లుక్కేద్దాం.

    ప్రత్యేక హెలిక్యాప్టర్లో

    ప్రత్యేక హెలిక్యాప్టర్లో

    ప్రియాంక చోప్రా ఫ్యామిలీ, నిక్ జొనాస్ ఫ్యామిలీ ముంబై నుంచి జోధ్‌పూర్ ఎయిర్ పోర్టు చేరుకుని... అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఉమైద్ భవన్ ప్యాలెస్ చేరుకుంటారని తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లన్నీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

    <strong>ప్రియాంక చోప్రా-నిక్ జొనాస్ వివాహానికి ప్రధాని మోడీ?</strong>ప్రియాంక చోప్రా-నిక్ జొనాస్ వివాహానికి ప్రధాని మోడీ?

    ప్యాలెస్‌లో 64 రూమ్స్ బుక్ చేశారు

    ప్యాలెస్‌లో 64 రూమ్స్ బుక్ చేశారు

    ప్రియాంక-నిక్ పెళ్లి వేడుక కోసం ప్యాలెస్‌లో 64 రూమ్స్, సూట్లు బుక్ చేశారట. ఇందులో 22 ప్యాలెస్ రూమ్స్, 42 సూట్స్ (24 హిస్టారికల్ సూట్స్, 10 రాయల్ సూట్స్, ఆరు గ్రాండ్ రాయల్ సూట్స్, 2 ప్రెసిడెన్షియల్ సూట్స్) ఉన్నాయట.

    ప్యాలెస్‌లో గదుల అద్దె వివరాలు, మొత్తం రూ. 3.2 కోట్ల ఖర్చు

    ప్యాలెస్‌లో గదుల అద్దె వివరాలు, మొత్తం రూ. 3.2 కోట్ల ఖర్చు

    ఈ ప్యాలెస్ అద్దెల విషయానికొస్తే... ప్యాలెస్ రూమ్స్ ధర రోజుకు రూ. 47.300, హిస్టారికల్ సూట్స్ ధర రోజుకు రూ. 65.300, రాయల్ సూట్స్ ధర రోజుకు రూ. 1.45 లక్షలు, గ్రాండ్ రాయల్ సూట్స్ ధర రోజుకు రూ. 2.30 లక్షలు, ప్రెసిడెన్షియల్ సూట్స్ ధర రోజుకు రూ. 5.04 లక్షలుగా ఉన్నట్లు తెలుస్తోంది. టాక్సులతో కలిపి ఈ మొత్తం ఖర్చు మరింత ఎక్కువగా ఉంటుందట. రోజుకు 64.40 లక్షల చొప్పన 5 రోజులకు 3.2 కోట్లు కేవలం ఇందులో స్టే చేయడానికి ఖర్చు చేస్తున్నారట.

    మూడు రోజుల పాటు కోటలో వేడుక

    మూడు రోజుల పాటు కోటలో వేడుక

    మెహంఘర్ కోట మేనేజ్మెంట్ ఆఫీసర్ ఒకరు మాట్లాడుతూ... ‘ఉమైదన్ భవన్ ప్యాలెస్‌లో కనీసం 40 రూమ్స్ బుక్ చేస్తేనే మెహ్రాంగర్ కోటలో ఇతర వేడుకలు నిర్వహించుకోవడానికి అనుమతి ఉంటుంట. ఇక్కడ లైటింగ్ లాంటివి ఏర్పాటు, స్టేజ్ లాంటి కోసం అదనంగా రోజుకు రూ. 10 లక్షలు ఖర్చు చేయాలట. ఈ కోటలో మూడు రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగనున్నాయి.

    మెహ్రాంగర్ కోటలో ఖర్చు ఎంతంటే?

    మెహ్రాంగర్ కోటలో ఖర్చు ఎంతంటే?

    మెహ్రాంగర్ కోటలో క్యాటరింగ్ ఖర్చు ఒక్కో వ్యక్తికి రూ. 18,000. మూడు రోజులకు కోటలో లైంటింగ్, స్టేజీ లాంటివి సెట్ చేయడానికి రూ. 30 లక్షలు. క్యాటరింగ్ ఖర్చు రూ. 43 లక్షల వరకు అవుతుందని అంచనా. ఇలా పెళ్లికి ముందు జరిగే సంగీత్, మెహందీ లాంటి వేడుకల కోసం రూ. 73 లక్షలు ఖర్చు చేస్తున్నారు ప్రియాంక, నిక్.

    మొత్తం పెళ్లి ఖర్చు రూ. 4 కోట్ల పైనే

    మొత్తం పెళ్లి ఖర్చు రూ. 4 కోట్ల పైనే

    ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో పెళ్లి, మెహ్రాంగర్ కోటలో జరిగే వేడుకల కోసం ప్రియాంక-నిక్ జొనాస్ దంపతులు రూ. 4 కోట్లకంటే ఎక్కువే ఖర్చు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

    రెండు సాంప్రదాయాల ప్రకారం పెళ్లి

    రెండు సాంప్రదాయాల ప్రకారం పెళ్లి

    డిసెంబర్ 2న ఇండియన్ స్టైల్ హిందూ వెడ్డింగ్, డిసెంబర్ 3న క్రిస్టియన్ స్టైల్‌లో ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ వివాహం జరుగబోతోంది.

    English summary
    Priyanka Chopra and Nick Jonas wedding will begin on November 29 and culminate in the wedding on December 2 and 3.According to reports, the couple have booked Taj Umaid Bhawan Palace for the wedding from November 29 to December 3, Spending more than Rs 4 crore on the wedding celebrations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X