పెళ్లి తర్వాత ప్రియాంక చోప్రా-నిక్ కాపురం ఈ లగ్జరీ ఇంట్లోనే... (ఫోటోస్)
Recommended Video

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఎంగేజ్మెంట్ ఇటీవల అమెరికన్ సింగర్, నటుడు నిక్ జొనాస్‌తో జరిగిన సంగతి తెలిసిందే. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట తాజాగా అమెరికా లాస్‌ఏంజెలెస్‌లో బేవర్లీ హిల్స్‌లో విలాసవంతమైన భవంతి కొనుగోలు చేశారు. దీని ఖరీదు 6.50 మిలియన్ డాలర్స్. మన కరెన్సీలో దాదాపు రూ. 48 కోట్లు.
ఈ విల్లాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 26 ఏళ్ల నిక్ జొనాస్... తనకు కాబోయే భార్య, 36 ఏళ్ల ప్రియాంక చోప్రా కోసం కొనుగోలు చేశాడట. ఇంటర్నేషనల్ మీడియా కథనాల ప్రకారం ఈ విల్లా 4129 చదరపు అడుగుల విస్తీర్ణంతో 5 బెడ్ రూమ్స్ కలిగి ఉందని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో ఫోటోస్ వైరల్
అందమైన ప్రకృతి వ్యూతో ఎంతో ఆహ్లాదరకమైన ప్రదేశంలో ఈ విల్లా ఉంది. స్విమ్మింగ్ ఫూల్‌తో పాటు ఇంకా ఇందులో ఎన్నో విలాసవంతమైన సదుపాయాలు ఉన్నాయి. ఈ ఇంటి ఫోటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

డిసెంబర్లో వివాహం
ఇక ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ వివాహం వచ్చే డిసెంబర్లో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్లో ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం మూడు రోజులపాటు జరుగనుంది. ఇక్కడ పెళ్లి ముగిసిన తర్వాత న్యూయార్కులో గ్రాండ్ బ్రైడల్ షవర్ జరుగనుంది. అంటే నిక్ జొనాస్ అమెరికాలో తన బంధువులు, స్నేహితులు, ఇతర సెలబ్రిటీలకు తన భార్యను పరిచయం చేసే ఫంక్షన్ అన్నమాట.

అలా ప్రేమలో పడ్డారు
అమెరికన్ టెలివిజన్ సిరీస్ క్వాంటికో, పలు హాలివుడ్ చిత్రాల్లో నటించడానికి అమెరికా వెళ్లిన ప్రియాంక చోప్రాకు 2017లో బేవాచ్ స్టార్ డ్వేన్ జాన్సన్(ది రాక్) ద్వారా నిక్ జొనాస్ పరిచయం అయ్యాడు. ఇద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ ఏడాది జులైలో లండన్ ట్రిప్‌లో ఉండగా ప్రియాంక 36వ పుట్టినరోజు సందర్భంగా నిక్ ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేశాడు.

అప్పటి వరకు సీక్రెట్
నిక్ జొనాస్ పెళ్లి ప్రపోజల్ తర్వాత ప్రియాంక చోప్రా అతడితో తన రిలేషన్ గురించిన విషయాలు బయట పెట్టింది. ఆగస్టులో సాంప్రదాయ బద్దంగా పెళ్లికి ముందు జరిగే రోకా సెర్మనీ నిర్వహించారు. అనంతరం ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో వీరి ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











