twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియాంక చోప్రా వెడ్డింగ్ సెలబ్రేషన్: వేడుకలా సాగిన సంగీత్ (ఫోటోస్, వీడియోస్)

    |

    బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా వివాహం అమెరికన్ సింగర్, నటుడు నిక్ జొనాస్‌తో జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో వైభవంగా జరిగింది. హిందూ, క్రిస్టియన్ రెండు సాంప్రదాయాల ప్రకారం పెళ్లి వేడుక నిర్వహించారు. అయితే ఈ వేడుకకు సంబంధించిన ఫోటోస్, వీడియోలు ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ ప్రియాంక చోప్రా తన అభిమానులను ఊరిస్తోంది.

    Recommended Video

    Priyanka Chopra-Nick Jonas Wedding : Priyanka-Nick Tied The Knot In Jodhpur’s Umaid Bhawan Palace

    తాజాగా సంగీత్ వేడుకకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. నిక్ జొనాస్‌, ప్రియాంక చోప్రాతో పాటు ఆమె తల్లి మధు చోప్రా కూడా ఈ వేడుకలో డాన్స్ చేశారు. ఇండియన్ బిగ్గెస్ట్ బిలియనీర్ ముఖేష్ అంబానీ దంపతులు కూడా ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొనడం విశేషం.

     సంగీత్ వేడుకలో నిక్-ప్రియాంక

    సంగీత్ వేడుకలో నిక్-ప్రియాంక

    ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ సంగీత్ సెర్మనీ ఒక వేడుకలా జరిగింది. బాలీవుడ్ ఈవెంట్‌కు ఏమాత్రం తీసిపోకుండా చేసిన స్టేజ్ సెటప్ ఈ వేడుకకు మరింత వన్నె తెచ్చింది.

    బాలీవుడ్ పాటలకు నిక్ డాన్స్

    బాలీవుడ్ పాటలకు నిక్ డాన్స్

    ఈ సందర్భంగా నిక్ జొనాస్ పలు బాలీవుడ్ పాటలకు డాన్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. అతడికి ఈ పాటలు, ఈ స్టెప్స్ అసలు ఏమీ తెలియక పోయినా నేర్చుకుని మరీ సూపర్‌ అనేలా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.

    తల్లీ కూతుళ్ల డాన్స్

    తల్లీ కూతుళ్ల డాన్స్

    ప్రియాంక చోప్రా తన తల్లి మధు చోప్రా కలిసి చేసిన డాన్స్ ఈ సంగీత్ వేడుకకే హైలెట్ అయింది. ఇద్దరూ కలిసి ఇలా డాన్స్ చేస్తూ కనిపించడం ఇదే తొలి సారి కావడంతో అభిమానులు మురిసిపోయారు.

    ముఖేష్ అంబానీ దంపతులు

    ముఖేష్ అంబానీ దంపతులు

    ప్రియాంక చోప్రా సంగీత్ వేడుకలో ఇండియన్ బిగ్గెస్ట్ బిలియనీర్ ముఖేష్ అంబానీ దంపతులు కూడా దర్శనమివ్వడం గమనార్హం. నిక్ డాన్స్ చేస్తుంటే ప్రియాంకతో పాటు నీతూ అంబానీ కూడా కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారు.

    ప్రియాంక చోప్రా సూపర్ హ్యాపీ

    ప్రియాంక చోప్రా సూపర్ హ్యాపీ

    ప్రియాంక చోప్రా మొహంలో ఉన్నడూలేనంత సూపర్ హ్యాపీ‌నెస్ కనిపించిందని, ఆమె ఎప్పుడూ ఇలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఈ నూతన దంపతులను విష్ చేశారు.

    గ్రూఫ్ ఫోటో

    గ్రూఫ్ ఫోటో

    సంగీత్ వేడుక సందర్బంగా ప్రియాంక- నిక్ జొనాష్‌తో కలిసి కుటుంబ సభ్యులు, అతిథులు కలిసి గ్రూఫ్ ఫోటో..

    సంగీత్ సెర్మనీ వీడియో టీజర్

    సంగీత్ వేడుకకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

    మెహందీ వేడుక

    సంగీత్ వేడుక కంటే ముందు మెహందీ సెర్మనీ నిర్వహించారు. అందకు సంబంధించిన ఫోటోస్ కూడా ప్రియాంక తన సోషల్ మీడియా పేజీ ద్వారా ఫ్యాన్స్ కోసం షేర్ చేశారు.

    English summary
    Can't get enough of Priyanka Chopra and Nick Jonas' wedding celebrations? Well then these new pictures are just what you need to brighten up your Sunday. After those lovely pictures from the mehendi ceremony, Priyanka has now shared pictures from her sangeet night and they are an absolute delight.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X