మెట్ గాలా ఈవెంట్‌లో భర్తతో ప్రియాంక సందడి.. ఆ లెగ్స్ అందాలతో హీటెక్కించిందిగా..
ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో ఒకటైన మెట్ గాలా ఈవెంట్ జోరుగా సాగుతోంది. న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో ఏటా నిర్వహించే ఈ ఫ్యాషన్ ఈవెంట్ లో వివిధ దేశాలకు చెందిన సెలబ్రిటీలు పాల్గొంటారు. ఈ ఏడాది జరుగుతున్న ఈ ఫ్యాషన్ ఈవెంట్ లో తన భర్తతో కలిసి బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా పాల్గొంది. ఇక ఆమె భర్త నిక్ జోనస్ కూడా పాల్గొన్నారు. ఈ ఇద్దరు ఈవెంట్ లో హైలెట్ కపుల్స్ గా నిలిచారు. వారికి సంబంధించిన ఫొటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
బ్లాక్ అండ్ వైట్ కలర్ వాలెంటినో ఔట్ ఫిట్‌లో దర్శనమిచ్చింది. నిక్ జోనస్ బ్లాక్ అండ్ వైట్ కలర్ సూట్ లో కనిపించాడు. కార్ల్ లాగర్‌ఫెల్డ్: ఎ లైన్ ఆఫ్ బ్యూటీ అనే థీమ్ తో ఈ ఏడాది ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. దిగ్గజ డిజైనర్ కార్ల్ లాగర్‌ఫెల్డ్‌కు నివాళి అర్పిస్తూ ఆయనకు ఇష్టమైన బ్లాక్ అండ్ వైట్ కలర్ డ్రెస్సుల్లో ఈ కపుల్ కనిపించారు. వీరిద్దరు కలిసి మెట్ గాలా మెట్లపై తమ గ్లామర్ ను ప్రదర్శించారు.

ప్రియాంక చోప్రా సైడ్ స్లిట్ నుండి థైస్ షోతో అందాలు ఆరబోసింది. వీరిద్దరూ కలిసి మెట్ గాలా మెట్లపై రొమాన్స్ పండించారు.ఇది చూసిన ప్రతీ ఒక్కరూ చాలా ఎగ్జైట్ కు గురయ్యారు.లవ్ కలిసి అలా నడుస్తూ వస్తుంటే చూసేందుకు రెండు కళ్లూ చాలలేవంటే అతిశయోక్తి కాదు.
మెట్ గాలా ఈవెంట్ లో ప్రియాంక, నిక్ జోనస్ కలిసి పాల్గొనడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు కూడా వీరిద్దరు పలుసార్లు మెట్ గాలా ఈవెంట్ లో పాల్గొన్నారు.

గతంలో ప్రియాంక ఔట్ ఫిట్ సంచలనంగా నిలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. 2019 లో ప్రియాంక అదిరిపోయే ఔట్ ఫిట్ లో కనిపించింది. ఈ డ్రెస్సుపైకి పిచ్చుక గూడు లాంటి హెయిర్ స్టైల్ క్యారీ చేసింది. అప్పట్లో ప్రియాంక ఈ డ్రెస్సుపై విపరీతమైన చర్చ జరిగింది. అదే ఈవెంట్ లో ఈ ఇద్దరు కపుల్స్ లిప్ లాక్ చేస్తూ అలరించారు. అంతకుముందు ప్రియాంక బ్రౌన్ కలర్ సూట్ ధరించి కనిపించింది. ఇందులో ప్రియాంక తన ఎద అందాలు ఆరబోసి ఆకట్టుకుంది.


Click it and Unblock the Notifications











